ఎంతో అట్టహాసంగా జరుగుతున్న మహానాడు సాక్షిగా మరోసారి తెలుగుదేశం పార్టీ తెలంగాణ అన్న పదం నిషేధించింది. దాదాపు పదేండ్ల క్రితం ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలోనే “తెలంగాణ” అన్న పదం ఉచ్చరించరాదని హుంకరించిన చంద్రబాబు, ఇవ్వాళ మరోసారి మహానాడు వేదికగా తెలంగాణపై తనకున్న ద్వేషాన్ని చూపించాడు.
మహానాడులో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి శ్రధ్ధాంజలి ఘటించే సందర్భంలో “ప్రాంతీయ ఉద్యమాల్లో మరణించినవారు” అంటూ కొత్త పల్లవి అందుకున్నారు తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇప్పటి వరకూ మరణించిన వారంతా తెలంగాణ వారే. మరి నేరుగా తెలంగాణ ఉద్యమం అనకుండా ప్రాంతీయ ఉద్యమాలు అంటూ సన్నాయినొక్కులెందుకు? గత నాలుగేళ్లలో వెయ్యికి పైచిలుకు తెలంగాణ బిడ్డలు తెలంగాణ కొరకు బలిదానం చేసుకుంటే, కనీసం వారికి సరిగ్గా శ్రద్ధాంజలి ఘటించలేని స్థితిలో తెలంగాణ టీడీపీ నాయకులు ఉండటం సిగ్గుచేటు.
తెలంగాణలో తెలుగుదేశం వంటి సీమాంధ్ర పార్టీలను నామరూపాలు లేకుండా చేయడమే తెలంగాణ పౌరులుగా మన కర్తవ్యం.