ప్రారంభించిన ఆరేళ్లలోనే దాదాపు రెండువేల స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించిన టీహబ్… ఇపుడు తన రెండవ కార్యాలయం ప్రారంభానికి సిద్ధమవుతోంది. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఈ స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్-2 ఈ నెల 28న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. మాదాపూర్ రాయదుర్గం నాలెడ్జ్‌సిటీలో సుమారు 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రంగా ఖ్యాతి పొందనున్నది. తెలంగాణ ప్రభుత్వం టీ హబ్-2ను అత్యున్నత ప్రమాణాలతో, అత్యంత విశాలమైన ప్రాంగణంలో, అత్యాధునిక మౌలిక వసతులతో నిర్మించింది. ప్రత్యేక అధునాతన వసతులు కల్పించిన టీ హబ్-2ను ఈ నెల 28న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో టెక్నాలజీ హబ్ (టీ హబ్)ను ఏర్పాటు చేశారు. ఆరేండ్లలో వివిధ కార్యక్రమాల ద్వారా 1,800 స్టార్టప్‌లను టీ హబ్ ప్రోత్సహించింది. సుమారు 600 కంపెనీలతో కలిసి పనిచేసింది. తాజాగా ప్రారంభిస్తున్న టీ హబ్-2లో ఒకేసారి రెండు వేలకుపైగా స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు వీలుగా అన్నిరకాల మౌలిక వసతులు కల్పించారు.
- Hyderabad Metro phase-2 stuck in limbo: Should the centre or state be blamed?
- RBI’s latest report highlights Telangana’s remarkable progress under KCR’s rule
- BRS stands firm in Bhopal court against Som distilleries and Congress government
- KCR left an indelible mark on agriculture: KTR quotes RBI’s handbook of statistics
- Did crop loan waiver cheques distributed by Revanth become void?
- గుండె నొప్పి వచ్చిన లగచర్ల రైతు హీర్యా నాయక్‌కు బేడీలు వేయడం అమానవీయం: కేటీఆర్
- సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది: హరీష్ రావు
- 8 మంది బీజేపీ ఎంపీలు బయ్యారం ఉక్కు పరిశ్రమపై స్పందించకపోవడం శోచనీయం: కవిత
- ప్రకటనలు కాదు.. పథకాల అమలు కావాలి.. కోతలు, కూతలు కాదు.. చేతలు కావాలి: కేటీఆర్
- తెలంగాణ బతుకు ఛిద్రమవుతుంటే ప్రేక్షకపాత్ర వహిస్తారా?: రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
- నీళ్ళు ఇవ్వలేము యాసంగి పంట తక్కువ వేసుకోవాలని అధికారులు చెప్తున్నారు: వినోద్ కుమార్
- స్పీకర్ వ్యవహార శైలికి నిరసనగా శాసనసభ్యుల ఓరియంటేషన్ సెషన్‌ను బహిష్కరిస్తున్నాం: కేటీఆర్
- తన బాస్‌లను సంతృప్తి పరిచేందుకే రేవంత్ నిన్న కొత్త తల్లిని సృష్టించాడు: జగదీశ్ రెడ్డి
- విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా?: హరీష్ రావు ధ్వజం
- తెలంగాణ ఆస్తిత్వాన్ని, వారసత్వాన్ని, ప్రజల భావోద్వేగాలను కేవలం ఒక జీవోతో మార్చలేరు: కవిత