mt_logo

స్వతంత్ర భారత వజ్రోత్సవాలు – నేడు ఘనంగా వన మహోత్సవం

రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 141 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో 159 ఫ్రీడం పార్కులను కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. వీటిల్లో 72,130 మొక్కలు నాటనున్నారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 17 ఫ్రీడం పార్కులను ఏర్పాటుచేస్తున్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరిలో 14, నిజామాబాద్‌ జిల్లాలో 10 ఫ్రీడం పార్కులు ఏర్పాటు చేయనున్నారు. వజ్రోత్సవాల గుర్తుగా నాటే మొక్కల సంఖ్య 75, 750, 7,500.. ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు ఉన్నతాధికారులు సూచించారు. వజ్రోత్సవాల కమిటీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి, కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36లోని ఫ్రీడమ్‌ పార్క్‌లో మొక్కలు నాటారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలోని పడగల్ గ్రామంలోని ఫ్రీడమ్ పార్క్‌లో 750 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు, యువత, అధికారులు పాల్గొని మొక్కలు నాటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *