స్వచ్ఛ హైదరాబాద్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కమిటీ సభ్యులతో ఈరోజు నాగపూర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఏడాదిలో హైదరాబాద్ ను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తామని, నాగపూర్ లో చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి, కార్పొరేషన్ విధానాన్ని పరిశీలించామని చెప్పారు.
చెత్త సేకరణ, డంపింగ్ యార్డు నుండి తరలింపు వంటి అంశాలను పరిశీలించామని ఎంపీ పేర్కొన్నారు. బీబీనగర్ లో రూ. 20 కోట్ల వ్యయంతో చెత్త నుండి విద్యుదుత్పత్తి చేసే పరిశ్రమ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తామని, వెయ్యి టన్నుల చెత్తతో 11 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.