ఇక చార్మినార్ వద్ద కూడా సండే-ఫండే ఫెస్టివల్

  • October 14, 2021 1:44 pm

ట్యాంక్‌ బండ్‌పై ప్రతివారం జరుగుతున్న సండే- ఫ‌న్‌డే ఇక చార్మినార్ వద్ద కూడా హంగామా చేయబోతోంది. హుస్సేన్ సాగర్ వద్ద జరుగుతున్న సండే-ఫండే కార్యక్రమం చార్మినార్ వద్ద కూడా జరపాలని మునిసిపల్ మంత్రి కేటీఆర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలు అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ కు సూచించగా.. దీనిపై తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని అరవింద్ కుమార్ చేసిన ట్వీట్ కి ప్రజలనుండి విపరీతమైన స్పందన వచ్చిన నేపథ్యంలో చార్మినార్ వద్ద కూడా సండే-ఫండే జరపాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు చార్మినార్ వద్ద సండే-ఫండే నిర్వహణపై కసరత్తులు కూడా ప్రారంభించారు. ఈ నెల 17 నుండి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టేందుకు గురువారం ఉద‌యం చార్మినార్ ప్రాంతాన్ని అరవింద్ కుమార్, సీపీ అంజ‌నీ కుమార్, ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ ప‌రిశీలించి, ఏర్పాట్ల‌పై స‌మీక్షించారు. చార్మినార్ వద్ద జరిపే క‌ల్చ‌ర‌ల్ ఈవెంట్స్ నిర్వ‌హ‌ణ‌తో పాటు పార్కింగ్ ఏర్పాట్ల‌పై చ‌ర్చించారు.


Connect with us

Videos

MORE