mt_logo

సీఎం కేసీఆర్ తో ఎంపీ సుబ్రమణ్యస్వామి, రాకేష్ తికాయత్ భేటీ

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌తో బీజేపీ నాయ‌కులు, రాజ్య‌స‌భ స‌భ్యులు సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి, భార‌తీయ కిసాన్ యూనియ‌న్ నాయ‌కులు రాకేశ్ తికాయ‌త్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌తో పాటు భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌పై చ‌ర్చించారు. కేసీఆర్‌తో క‌లిసి సుబ్ర‌మ‌ణియ‌న్ స్వామి, రాకేశ్ తికాయ‌త్ లంచ్ చేశారు. వారితో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు. బీజేపీ, కాంగ్రెసేత‌ర పార్టీల‌తో జాతీయ స్థాయి కూట‌మిని ఏర్పాటు చేసేందుకు వివిధ పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే ప‌నిలో ఉన్న‌ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్… ఇటీవ‌లే మ‌హారాష్ట్ర‌లో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక‌రేతో పాటు ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్‌తో కేసీఆర్ స‌మావేశ‌మై జాతీయ రాజ‌కీయాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *