mt_logo

ఈ దెబ్బతో ఈటెలకు భారీ డ్యామేజీ ?

దళితబంధు ఈటెల రాజేందర్ కొంప ముంచబోతోందా.? తను జాగ్రత్తగా ఒక్కో మెట్టు పేర్చుకుంటూ వస్తే.. బీజేపీ నేతలు అత్యుత్సాహంతో ఈటెల బతుకు బస్టాండ్ చేయబోతున్నారా.?? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దళితబంధు ఆపాలని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయగా.. ఎన్నికలు జరిగేంత వరకు దళితబంధు ఆపాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. దీంతో హుజురాబాద్ ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా హీటెక్కిపోయింది. దళిత బంధు ఆగిపోయిన మరుక్షణమే దానికి కేసీఆరే కారణం అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ట్వీట్ చేయడంతో అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. దళితుల నోట్లో మట్టిగొట్టడానికే బీజేపీ నాయకులు ఈ పథకం ఆపించారని తీవ్ర ఆరోపణలు చేశారు టీఆర్ఎస్ నాయకులు. అసలు దళిత బంధు ఎందుకు ఆగిందో ఈటెల రాజేందర్ సమాధానం చెప్పాలంటూ బాల్క సుమన్ విరుచుకుపడగా.. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి లేఖ వల్లే దళితబంధు ఆగిపోయిందని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.

ఎలాగైనా అధికార పార్టీని ఇరుకునపెట్టాలనే బీజేపీ ఈ పని చేసిందా..? ఒక వేళ ఈ పని బీజేపీదే అయితే ఈటెలకు భారీ డ్యామేజీ చేసినట్లే. అంతిమంగా ఇది దళితుల ఆగ్రహానికి కారణం అయితే దళిత ఓట్లన్నీ గంపగుత్తగా టీఆర్ఎస్ వైపు మళ్లే అవకాశం ఉంది. ఈ చర్య వల్ల ఈటల ఓట్లలో భారీ కోత పడనుందా.?. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈసీ తన పరిధి అతిక్రమించింది అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తే.. ఇది ఖచ్చితంగా బీజేపీ కుట్ర అని, ఈటల రాజేందర్ దీనికి సమాధానం చెప్పాలంటూ టీఆరెస్ దళిత నేతలు నిలదీస్తున్నారు. చాలా చోట్ల బీజేపీ నేతల దిష్టబొమ్మల దహనాలు జరుగుతున్నాయి. మొత్తం మీద సరిగ్గా ఎన్నికల ముందు జరిగిన ఈ హఠాత్పరిణామంతో ఈటెలకు కోలుకోలేని దెబ్బ తగలొచ్చు. ఎందుకంటే ఈ పథకం తాత్కాలికంగా ఆగినా తరువాత ఇవ్వాల్సింది టీఆర్ఎస్ యే కాబట్టి ఓటర్లు టీఆర్ఎస్ తో గొడవ పెట్టుకోరు. సో…ఇది ఎవరి అత్యుత్సాహమో..ఎవరి ప్లానింగ్ లోపమో గానీ ఈటెల కొంప ముంచడం ఖాయం అనే వాదనలు మొదలయ్యాయి.చూద్దాం..ఈ పరిణామం ఎటు దారి తీస్తుందో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *