ఫొటో: ఢిల్లీలోని ఏపీ భవన్ ముందు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం నిలువెత్తు విగ్రహం. ఇక్కడ హైదరాబాద్ మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు విగ్రహం పెట్టకపోవడం సీమాంధ్రుల వివక్షకు నిదర్శనం.
—
తెలంగాణకు వ్యతిరేకంగా, సమైక్యవాద ముసుగులో ధర్నా చేసేందుకు ఢిల్లీ వచ్చిన్న సీమాంధ్ర ఉద్యోగులకు ఏపీ భవన్ లో అన్ని రకాల సదుపాయాలు లభించాయి. అధికారులు దగ్గరుండి మరీ రాచమర్యాదలు చేశారు. తిండి, వసతి సదుపాయాలు కల్పించారు. ఏపీ భవన్ లో వున్న రూముల్లో సగానికి పైగా వాళ్ళకే కేటాయించారు. దీంతో ఢిల్లీకి వివిధ పనుల మీద వచ్చిన అనేకమంది రాష్ట్రవాసులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఏపీ భవన్ అధికారుల తీరుపై వారు మండిపడ్డారు.
తెలంగాణ కోసం పార్లమెంట్ ఎదుట ఆత్మ బలిదానం చేసిన యాదిరెడ్డి భౌతికకాయాన్ని కూడా లోపలికి రానివ్వని అధికారులు సమైక్యవాదులకు రాచమర్యాదలు అందిస్తున్నారని వరంగల్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు చిలుకూరి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఏపీ భవన్ పేరును ‘ఆంధ్ర భవన్’గా మార్చి పెట్టుకోవాలని సూచించారు.
ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలకు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే సహాయసహకారాలు అందిస్తుండడం విశేషం.
సీమాంధ్ర ఉద్యోగులకు ఏపీ భవన్ లో సబ్సిడీ రేట్లపై గదుల కేటాయింపు, భోజన సదుపాయాలు కల్పించడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
—
తెలంగాణ కొరకు యాదిరెడ్డి ఆత్మబలిదానం చేసుకున్నప్పుడు ఏపీ భవన్ అధికారుల అమానవీయ ప్రవర్తన చదవండిక్కడ: