హైదరాబాద్ లో పార్కింగ్ వసతులు మెరుగుపరిచే ప్రణాళికలో భాగంగా నాంపల్లిలో ఆటోమేటెడ్ మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ రూపుదిద్దుకుంటున్నది. సుమారు అర ఎకరం స్థలంలో 15 అంతస్తుల్లో పీపీపీ విధానంలో రూ. 60కోట్లతో హెచ్‌ఎంఆర్ దీనిని నిర్మిస్తున్నది. ప్రస్తుతం 14వ అంతస్తు స్లాబ్ పనులు పూర్తయ్యాయి. వచ్చే మార్చి చివరి నాటికల్లా పూర్తి చేసి ఏప్రిల్ మొదటి వారంలో అందుబాటులోకి తీసుకొస్తామని మెట్రోరైల్ అధికారులు వెల్లడించారు.
ప్రత్యేకతలు ఇవే :
15 అంతస్తుల్లో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో నిర్మాణం
10 అంతస్తుల్లో పార్కింగ్ సౌకర్యం, మిగతా అంతస్తుల్లో వ్యాపార సంస్థల ఏర్పాటు.
పీపీపీ విధానంలో రూ. 60 కోట్లతో పనులు.
జర్మనీకి చెందిన పాలిస్ సంస్థ సహకారం.. సుమారు 250 కార్లు, 100 ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసుకునే వీలు.
కాంప్లెక్స్‌కు అనుసంధానంగా నాంపల్లి మెట్రో స్టేషన్‌కు, గాంధీభవన్ వైపు స్కైవాక్‌లు.
సోలార్‌తో పాటు విండ్ పవర్ ఉత్పత్తి చేసేలా సరికొత్త వ్యవస్థ.
స్మార్ట్ కార్డుతోనే పార్క్ చేసే కారు తిరిగి పొందేలా సాంకేతికత.