10 నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 80 వేల కోట్లు అప్పుచేసినా.. ఏ రంగంలోనూ ఒక గణనీయమైన మార్పు లేదు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు. రుణమాఫీ ఒక మాయ.. రైతుభరోసా ఒక భ్రమ.. హైడ్రాతో హైదరాబాద్ ఇమేజ్‌ను.. అడ్డగోలు మాటలతో తెలంగాణ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారు అని మండిపడ్డారు.
తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది ప్రజా పాలన కాదు.. పడకేసిన పాలన. రుణానికి మాఫీ లేదు.. రైతుకు భరోసా లేదు. రుణమాఫీ ఒక మాయ.. రైతుభరోసా ఒక భ్రమ. రాష్ట్రంలో పాలన గాడితప్పింది అని విమర్శించారు.
రాష్ట్రంలో రూ. 2 లక్షల రుణం మాఫీ అయిన ఒక్క రైతును చూయించండి. 60 ఏండ్ల సమైక్య పాలనలో అధోగతి పాలైన తెలంగాణను కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్లలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిచింది. ఈ రోజు దేశంలోనే ధనిక రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ 2. తెలంగాణ కన్నా ముందు దశాబ్దాల క్రితం ఏర్పడిన రాష్ట్రాలు కునారిళ్లి ఉన్నాయి.. ఇది కళ్ల ముందు కనిపిస్తుంది అని అన్నారు.
10 నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 80 వేల కోట్లు అప్పుచేసినా.. ఏ రంగంలోనూ ఒక గణనీయమైన మార్పు లేదు. కేసీఆర్ గారి పాలనలో అప్పులు చేసి అనేక రంగాల్లో సమూల మార్పులకు బాటలు వేశాం అప్పులు చేసి ఏం చేశారో తెలియదు. కానీ రుణమాఫీ మాత్రం చేయలేదు. మొదట రూ. 49 వేల కోట్లు రుణమాఫీకి అంచనా వేశారు.. రేవంత్ రూ. 41 వేల కోట్లు అని ప్రకటించారు. బడ్జెట్‌లో రూ. 26 వేల కోట్లు ప్రకటించారు. చివరికి రూ. 17 వేల కోట్లు మాఫీ చేసి అయిపోయిందని చెబుతున్నారు అని అన్నారు.
రైతుభరోసా ఎగ్గొట్టారు.. పంటకాలం పూర్తవుతున్నా రైతుకు పెట్టుబడి సాయం అందించలేదు. వరంగల్ డిక్లరేషన్‌లో రూ. 2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, పంటల బీమా, పసుపు బోర్డు, చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తాం అని గొప్పలు చెప్పారు.. కానీ ఒక్క అడుగు ముందుకు పడలేదు అని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మూలంగా బీమా కంపెనీలకు లాభం తప్ప రైతులకు ప్రయోజనం ఉండదని చెప్పాం.. కేంద్రమే ఒక కొత్త పథకం తేవాలని అనేకమార్లు విజ్ఞప్తి చేశాం. బీమా కంపెనీలు తమ లాభం తప్ప రైతుల లాభం కోసం పనిచేయవని చెప్పాం.కానీ కాంగ్రెస్ పార్టీ బీమా గురించి గొప్పలు చెప్పారు అని అన్నారు.
వ్యవసాయ మంత్రి తుమ్మల ఏదో రైతులకు చేయాలి అన్న ఆలోచనతో ఉన్నా ఆయన సూచనలు ఆమోదించే పరిస్థితిలో సీఎం లేడు. రైతు భరోసా రైతుకు, కౌలు రైతుకు ఇస్తామన్నారు. కానీ కొద్ది రోజుల క్రితం వ్యవసాయ మంత్రి చావు కబురు చల్లగా రైతుభరోసా ఎవరు తీసుకుంటారో రైతు, కౌలురైతు తేల్చుకోవాలని చెప్పారు. తెలంగాణలో కౌలు రైతు విధానం, ఆంధ్రాలో కౌలు విధానం వేరని కేసీఆర్ గారు శాసనసభలో పలుమార్లు చెప్పారు అని గుర్తుచేశారు
తెలంగాణలో ఏటా పాలుకు ఇచ్చే విధానం.. ఆంధ్రాలో కౌలుకు ఇచ్చే విధానం ఉంటుందని చెప్పాం. కొందరు ఆంధ్రా నేతల చేతుల్లో ఉన్న రైతుసంఘాలు ఈ వాదన తెచ్చాయి.. దానిని కాంగ్రెస్ అందుకుని కౌలు రైతులకు రైతుభరోసా అని బురిడీ కొట్టించింది.. ఇప్పుడు అసలు విషయం బయటపెట్టి ముసుగు తొలగించింది అని నిరంజన్ రెడ్డి అన్నారు.
తెలంగాణలో 92.5 శాతం దాదాపు కోటి 40 లక్షల ఎకరాల భూమి చిన్న, సన్నకారు రైతుల చేతుల్లో ఉందని అనేక సార్లు వెల్లడించాం. రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీకి మళ్లించారు.. ఇప్పుడు రైతుభరోసా పది ఎకరాల వరకే అంటున్నారు. కౌలు రైతులకు రైతుభరోసా ఇవ్వం అంటున్న కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.
రూ.80 వేల కోట్లు అప్పు చేసినా రైతుభరోసా, రూ. 2,500, తులం బంగారం, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, విద్యార్థులకు అల్పాహారం అన్నీ మాయం అయ్యాయి. విజయ డైరీ రైతులకు మూడు నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదు. రైతు ఈ దేశ సౌభాగ్యం.. అలాంటి రైతులను రోడ్డెక్కారు. విజయ డైరీ ప్రభుత్వ డైరీ.. కేసీఆర్ హయాంలో లాభాలు ఎలా వచ్చాయి? ఇప్పుడెలా నష్టాలు ఎలా వస్తాయి? హెరిటేజ్‌కు లాభాలు ఎలా వస్తాయి? విజయ డైరీ ఎలా నష్టపోతుంది? అని ప్రశ్నించారు.
పాల రైతులను హెరిటేజ్ వైపు మళ్లించేందుకు కుట్ర జరుగుతుంది.. రూ. 204 కోట్లతో హెరిటేజ్ పెట్టబడులు పెడుతుంది. పాల రైతులు రోడ్డెక్కితే ఒక్క మంత్రి ఎందుకు మాట్లాడడం లేదు? అంత తీరిక లేదా? అని అడిగారు.
లొసుగులు ఎత్తి చూపుతున్న ప్రతిపక్షాల మీద వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. విపక్షాలు అధికార పార్టీ మీద ఆరోపణలు చేస్తే వివరణ ఇస్తాయి. కానీ విచిత్రంగా తెలంగాణలో అధికార పార్టీ నేతలు విపక్షాల మీద దాడి చేస్తున్నారు. ఎదుటి వారికి గౌరవం ఇస్తేనే తిరిగి గౌరవం లభిస్తుంది. విచిత్రంగా సీఎం ఇక్కడ నేను తిడతాను గానీ మీరు నా సీటుకు గౌరవం ఇవ్వాలని అంటున్నారు అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ వస్తే రైతుబంధు ఇవ్వలేదు అని మేం చెప్పిన మాటలే నిజమయ్యాయి. పంటల బీమా విషయంలో ప్రపంచ దేశాల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేసి ఒక మంచి పాలసీ తేవాలని ప్రభుత్వానికి, వ్యవసాయ మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా.. బీమా కంపెనీలు ఎప్పుడూ నష్టపోయి రైతుకు మేలు చేయవు.. ఇది వాస్తవం అని తెలిపారు.
కేసీఆర్ గారి హయాంలో పంటల బీమా కోసం నాలుగేళ్లు రూ. 2,400 కోట్లు భీమా కంపెనీలకు కడితే రైతులకు తిరిగి రూ. 1,800 కోట్లే వచ్చాయి.అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క రైతుకు పంట నష్టం ఇవ్వలేదు.అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి.. అబద్ధాలతోనే పాలన చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
హైడ్రాతో హైదరాబాద్ ఇమేజ్‌ను.. అడ్డగోలు మాటలతో తెలంగాణ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారు. ఆక్రమణల తొలగింపు కోసం ఇప్పటికే ఉన్న చట్టాలను గాలికి వదిలేసి హైడ్రా పేరుతో హైప్ సృష్టిస్తున్నారు. దీనికి ఒక సెక్షన్ మీడియా ఏదో అద్భుతం జరుగుతుంది అన్నట్లు ప్రచారం చేస్తున్నాయి. గతంలో పెద్ద పెద్ద వారి మీద ఆరోపణలు చేసి.. అధికారంలోకి వచ్చాక నోరు మూసుకోవడం వెనక ఏం జరిగింది పేదల ఇండ్లను కూలగొట్టి పెద్దలను లొంగ తీసుకుంటున్నారు అని ఆరోపించారు.
కేసీఆర్ అప్పులు చేశాడని కొన్నాళ్లు ఆరోపించారు.. పక్క రాష్ట్ర సీఎం రూ. 4 వేల ఫించన్ అమలు చేస్తుంటే ఇక్కడెందుకు అమలు చేయడం లేదు.ప్రశ్నిస్తే తప్పుడు ఆరోపణలతో సోషల్ మీడియాలో విషప్రచారం చేసి శునకానందం పొందుతున్నారు. సన్నవడ్లకు రూ. 500 బోనస్ అనేది ఒక బోగస్ మాట.. అసలు సన్నవడ్లు హాట్ కేకులా అమ్మడుపోతాయి.. వీరెవరికి ఇస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వ తీరు మార్చుకోకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు హెచ్చరించారు.
- Why did Revanth select controversial Meinhardt company for the Musi Beautification Project?
- Revanth & Co’s frequent foreign trips: A drain on Telangana’s exchequer
- KTR accuses Congress govt. of implementing ‘bulldozer culture’ in Telangana
- Why did cost of Musi Beautification Project soar to Rs. 1.5 lakh cr?
- Fearing backlash, saree distribution to women’s groups in 6 districts halted
- కొండా సురేఖపై పరువు నష్టం కేసు వేసిన కేటీఆర్
- భారత వ్యాపార ముఖచిత్రాన్ని మార్చేసిన రతన్ టాటా ఎందరికో ప్రేరణ: కేటీఆర్
- ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా: కేసీఆర్
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- డబ్బు సంచులతో పట్టుబడ్డ రేవంత్ ఉపాధ్యాయులకు నీతి వచనాలు చెబుతున్నాడు: హరీష్ రావు
- యూపీలో లాగా తెలంగాణలో రేవంత్ బుల్డోజర్ సంస్కృతిని తీసుకొచ్చాడు: కేటీఆర్
- ఏడు గ్యారెంటీల కాంగ్రెస్ గారడీని హర్యానా ప్రజలు తిరస్కరించారు: కేటీఆర్
- 10 లక్షల మంది గురుకుల విద్యార్థులతో ప్రభుత్వం ఆడుకుంటోంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- కాంగ్రెస్ గ్యారెంటీల మోసం నుండి తప్పించుకున్న హర్యానా!
- సోషల్ మీడియాను చూసి భయపడుతున్న రేవంత్ రెడ్డికి కేసీఆర్ కావాలా?: జగదీశ్ రెడ్డి