అమృత్ టెండర్లలో రూ. 8,888 కోట్ల కుంభకోణంపై తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈరోజు రూ. 8,888 కోట్ల రూపాయల అమృత్ టెండర్ల కుంభకోణం గురించి సాక్ష్యాలతో బయటపెడుతున్నం. ఈ రూ. 8,888 కోట్ల భారీ అవినీతికి రేవంత్ రెడ్డి తెర లేపారు అని ఆరోపించారు.
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఇంత పెద్ద భారీ కుంభకోణానికి రేవంత్ రెడ్డి పాల్పడ్డారు. తాను బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక శాఖ కేంద్రంగా రేవంత్ రెడ్డి ఈ కుంభకోణాన్ని చేశారు. ఈ భారీ కుంభకోణంతో రేవంత్ రెడ్డి పదవి కోల్పోయి అవకాశం ఉన్నది అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకున్నా వేల కోట్ల రూపాయలు పనులను కట్టబెట్టారు. ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని పిలిపించి బెదిరించి ఆ కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారు. పేరుకే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ అయినా రేవంత్ రెడ్డి బావమరిది కోసం ఈ టెండర్లను కట్టబెట్టారు అని అన్నారు.
ఇందులో టెండర్ దక్కించుకున్న ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీతో రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీతో జాయింట్ వెంచర్ పేరుతో డ్రామాకి తెరలేపారు రూ. 1137 కోట్ల రూపాయల కాంట్రాక్టు గెలుచుకున్న తర్వాత ఆ కంపెనీ 20 శాతం పని చేస్తుంది అంట. ముఖ్యమంత్రి బావమరిది మాత్రం 80% వెయ్యి కోట్ల పని చేస్తుంది అంట అని ఎద్దేవా చేశారు.
ఐహెచ్పీ అనే కంపెనీ ఈ మేరకు సెబీకి సమాచారం ఇచ్చింది. ఈ కంపెనీని శిఖండి సంస్థగా అడ్డుపెట్టుకొని అనుముల రేవంత్ రెడ్డి, సూదిని సృజన రెడ్డి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా అధికారులపైన ఒత్తిడి తీసుకువచ్చి ఈ కాంట్రాక్టులు కట్టబెట్టారు. ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక శాఖ కేంద్రంగా ఈ భారీ అవినీతికి తేర లేపారు అని విమర్శించారు.
ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టం, అవినీతి నిరోధక చట్టం 7, 11, 13 నిబంధనల మేరకు రేవంత్ రెడ్డి విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది.. రేవంత్ పదవి కొల్పోతారు. తన కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరిస్తే ఆశ్రితపక్షపాతం చూపిస్తే ఈ చట్టం ప్రకారం శిక్షార్హులు. ఇవే చట్టాల కింద సోనియాగాంధీ తన పదవిని కోల్పోయింది అని గుర్తు చేశారు.
2006లో సోనియా గాంధీ నేషనల్ అడ్వైజరి కౌన్సిల్ చైర్‌పర్సన్‌గా పదవిలో ఉన్నందుకు ఈ చట్టం ప్రకారం మన పదవిని కోల్పోయింది. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప కూడా అక్రమ మైనింగ్ అనుమతులు తన కుటుంబ సభ్యులకు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి 2011లో అశోక్ చవాన్ ఆదర్శ కుంభకోణంలో తన పదవి కోల్పోయారు అని అన్నారు.
బావమరిది కళ్ళల్లో సంతోషం కోసం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. తన ఇంట్లో లంకే బిందలు నింపుకోవడం కోసం అక్రమ టెండర్లకు ముఖ్యమంత్రి తెరలేపారు. రేవంత్ రెడ్డి అమృత్ టెండర్లలో పిలిచిన రూ. 8,888 కోట్ల రూపాయల టెండర్ల వివరాలను ప్రభుత్వం బయట పెట్టడం లేదు అని పేర్కొన్నారు.
ఇండియన్ హ్యూమన్ పైప్ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజీలకు సమాచారం ఇవ్వాల్సిన గత్యంతరం నేపథ్యంలోనే ముఖ్యమంత్రి బావమరిది శ్రుజన్ రెడ్డి రెడ్డికి దక్కిన వందల కోట్ల రూపాయల టెండర్ బయటకు వచ్చింది. వీటికి సంబంధించిన ఒక్క జీవో కూడా ప్రభుత్వం వెబ్సైట్లో పెట్టడం లేదు. టెండర్ల తాలూకు పూర్తి సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.
రేవంత్ రెడ్డి చేస్తున్న అనేక కుంభకోణాలకు సంబంధించిన వివరాలను ప్రజల ముందు వరుసగా ఉంచుతాం. కొడంగల్ ఎత్తిపోతల పథకం, ఫోర్ బ్రదర్స్ సిటీ వంటి కుంభకోణాలను ప్రజల ముందు ఉంచుతాం. బావమరిదికి అమృతం పంచుతూ తెలంగాణ ప్రజలకు విషాన్ని పంచుతున్న రేవంత్ రెడ్డిని ప్రజల ముందు ఎండగడతాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
సృజన్ రెడ్డి కంపెనీకి ఉన్న లాభం కేవలం రెండు కోట్లే. రెండు కోట్ల కంపెనీ వెయ్యికోట్ల పనులు చేస్తుంది అంట. పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయిన ఐహెచ్పీ కంపెనీ కేవలం రూ. 200 కోట్లు పనిచేస్తుందట. బావమరిది కంపెనీకి రూ. 1,100 కోట్ల పనులు ఇచ్చి జీవోలు ఎందుకు వెబ్సైట్లో పెట్టడం లేదు రేవంత్ రెడ్డి చెప్పాలి
రెండు కోట్ల కంపెనీకి వెయ్యి కోట్లు టెండర్ అప్పజెప్పి ఈ విషయాన్ని ఎందుకు రేవంత్ రెడ్డి దాస్తున్నారో చెప్పాలి. ఇందులో ముఖ్య మంత్రి ఒత్తిడి మేరకే ఈ టెండర్ల గోల్మాల్ జరిగింది. ఈ రాష్ట్రంలో బయటకు సమాచారం రాని అక్రమాలు ఎన్నో ఉన్నాయి అని ఆరోపించారు.
అమృత్ పథకం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం.అందుకే ఈ టెండర్లు జరిగిన అభివృద్ధి అక్రమాలపైన నిన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు లేఖ రాశాము. ఈ టెండర్లలో జరిగిన అక్రమాలను తేల్చాలని కోరాము అని అన్నారు.
భారతీయ జనతా పార్టీకి ఇద్దరు కేంద్ర మంత్రులు 8 మంది ఎంపీలు ఉన్న కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం జరిగిన అక్రమాల పైన ఎందుకు మాట్లాడటం లేదు. బీజేపీ కుమ్మక్కు కాకుంటే పూర్తిస్థాయి ఎంక్వైరీ విచారణకు కేంద్రం ఆదేశించాలి. అమృత్ టెండర్లను వెంటనే రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు.
ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాకుంటే, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్రం పరిధిలోని ఈ పథకంలో జరుగుతున్న అవినీతిపైన వెంటనే విచారణకు ఆదేశించాలి.. లేకుంటే రేవంత్ రెడ్డికి కేంద్రంలోని బిజెపి నేతలకు అవినీతితో సంబంధం ఉంది అనుకోవాల్సి వస్తుంది అని అన్నారు.
ఈ విషయంలో స్పందించకుంటే మీ కుమ్మక్కు రాజకీయాలు అర్థమవుతాయి. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రెడ్డి మాట్లాడిన తర్వాత కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు బిజెపి మౌనం వహించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తనకు నచ్చిన విచారణ సంస్థతో ఈ అంశంలో విచారణ చేయించాలి అని కోరారు.
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యలో ప్రేమ కథ నడుస్తుంది. అందుకే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌లు ముఖ్యమంత్రి సుద్దపూస అంటూ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని పేర్కొన్నారు.
- Is Meinhardt replicating Pakistan’s failed model for the Musi Beautification Project?
- Why did Revanth select controversial Meinhardt company for the Musi Beautification Project?
- Revanth & Co’s frequent foreign trips: A drain on Telangana’s exchequer
- KTR accuses Congress govt. of implementing ‘bulldozer culture’ in Telangana
- Why did cost of Musi Beautification Project soar to Rs. 1.5 lakh cr?
- కొండా సురేఖపై పరువు నష్టం కేసు వేసిన కేటీఆర్
- భారత వ్యాపార ముఖచిత్రాన్ని మార్చేసిన రతన్ టాటా ఎందరికో ప్రేరణ: కేటీఆర్
- ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా: కేసీఆర్
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- డబ్బు సంచులతో పట్టుబడ్డ రేవంత్ ఉపాధ్యాయులకు నీతి వచనాలు చెబుతున్నాడు: హరీష్ రావు
- యూపీలో లాగా తెలంగాణలో రేవంత్ బుల్డోజర్ సంస్కృతిని తీసుకొచ్చాడు: కేటీఆర్
- ఏడు గ్యారెంటీల కాంగ్రెస్ గారడీని హర్యానా ప్రజలు తిరస్కరించారు: కేటీఆర్
- 10 లక్షల మంది గురుకుల విద్యార్థులతో ప్రభుత్వం ఆడుకుంటోంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- కాంగ్రెస్ గ్యారెంటీల మోసం నుండి తప్పించుకున్న హర్యానా!
- సోషల్ మీడియాను చూసి భయపడుతున్న రేవంత్ రెడ్డికి కేసీఆర్ కావాలా?: జగదీశ్ రెడ్డి