గట్టి వార్నింగ్ తో తోక ముడిచిన శేఖర్ కమ్ముల టీమ్

  • September 25, 2021 2:13 pm

తాజాగా విడుదల అయిన లవ్ స్టోరీ సినిమాలో తెలంగాణ ప్రభుత్వం మీద సెటైర్ వేసిన శేఖర్ కమ్ముల అండ్ టీమ్ ప్రభుత్వ పెద్దలు కన్నెర్ర చేయడంతో తోక ముడిచిండు. సినిమాలో తెలంగాణను కించపరిచేలా ఉన్న డైలాగ్ తొలగించారు. యూట్యూబ్ లో ఉన్న ట్రెయిలర్ లో నుండి కూడా డైలాగ్ తొలగించారు.

తెలంగాణను తక్కువ చేయడానికి, ఏదో ఒకటి అనడానికి కొంతమంది ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు. అందులో తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో అవకాశం వచ్చినప్పుడల్లా తమ మాటల ద్వారానో, సినిమాల ద్వారానో ఉద్యమం మీద రాళ్ళు వేసేవాల్లు. కుక్క తోక వంకర అన్నట్టు కొందరు ఇప్పటికీ ఆ ధోరణి మార్చుకోవడం లేదు. దీనికొక క్లాసిక్ ఉదాహరణ శేఖర్ కమ్ముల. తెలంగాణ ఉద్యమ సమయంలో తీసిన లీడర్ సినిమాలో తెలంగాణను కించపరిచేలా డైలాగులు పెట్టాడు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ పట్ల సానుకూలంగానే ఉన్నప్పటికీ.. లక్షల మందికి ఉపాధి కల్పించే రంగం అనే దృష్టితో ఎంత అతి చేసినా సినిమా ప్రముఖులకు తగు గౌరవం ఇస్తూ వస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ పెద్దలకు కూడా అటు ఆంధ్ర ప్రభుత్వం కన్నా తెలంగాణ ప్రభుత్వమే బెటర్ అని అర్థమయ్యింది. శేఖర్ కమ్ముల వంటి డైరెక్టర్లు ఈ సుహృద్భావ వాతావరణం చెడగొట్టే పనులు చేయడం మానుకుంటే బెటర్ అని ఇండస్ట్రీ ప్రముఖులు హితవు పలుకుతున్నారు.


Connect with us

Videos

MORE