రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలోని 41,392 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరచుకోగా… విద్యార్థులు మళ్లీ పుస్తకాలు చేతపట్టుకుని హుశారుగా తరగతులకు హాజరయ్యారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 1.04 లక్షల మంది ఉపాధ్యాయులకు అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం శిక్షణ ఇప్పిచ్చింది. కరోనాతో గత రెండేండ్లుగా విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమయ్యింది. ఈ అకడమిక్ క్యాలెండర్ ప్రతీ సంవత్సరంలాగే 2022 -23 విద్యా సంవత్సరం జూన్ రెండో వారంలో మొదలవుతున్నది.