ఫొటో: కర్నూల్ టౌన్లో దీక్ష శిబిరం మూతపడ్డది ఇక్కడే
—
మూడు వారాలు కూడా గడవక ముందే సీమాంధ్రలో తెలంగాణ వ్యతిరేక ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి. అనేక జిల్లాల్లో ఆగస్టు మొదటి వారంలో నెలకొల్పిన రిలే నిరాహార దీక్ష శిబిరాలు క్రమంగా ఎత్తివేయడం మొదలైంది.
కొన్నిటిని నిర్వాహకులే ఎత్తివేయగా, మరికొన్నింటిని పోలీసులు ఎత్తివేశారు. ముఖ్యంగా కాంగ్రెస్, తెదేపా పార్టీలకు చెందిన అనేక దీక్షా శిబిరాలు గత రెండు రోజుల్లో ఎత్తివేశారు.
ఎంత బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించినా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బెదరకపోవడంతో ఇక లాభం లేదనుకున్న స్థానిక నాయకులు తమ నిరసన కార్యక్రమాలు తగ్గించడం మొదలుపెట్టిండ్రు.
నిన్న కర్నూల్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎదురుగా నడుస్తున్న రిలే నిరాహారదీక్ష శిబిరం కూడా మూతపడింది.
ఈ నెల మొదటివారంలో ఎంతో అట్టహాసంగా మొదలైన ఈ రిలే నిరాహారదీస్ఖ శిబిరంలో రోజూ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఎవరో ఒకరు కూర్చునే వారు. గత రెండు మూడు రోజులుగా ఎవరూ ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఎటూ పాలుపోని నిర్వాహకులు నిన్న టెంటు పీకేశారు.
గతంలోలా రెండు వారాలు హడావిడి చేస్తే కేంద్రం వెనకకు తగ్గుతుందనే ఆశతో నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టామని, కానీ కేంద్రం ఈసారి ముందుకేపోవాలని కృతనిశ్చయంతో ఉండటంతో ప్రతిరోజూ వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని దీర్ఘకాలం ఇట్లాంటి ఆందోళనలు కొనసాగించలేమని సీమాంధ్రలో స్థానిక నాయకులు భావిస్తున్నారు.