mt_logo

ఏ.పీ.ఎన్.జీ.ఓ నేత అశోక్ బాబు ఓ పెద్ద 420!

-దొంగపత్రాలతో హైదరాబాద్‌లో పోస్టింగ్
-అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే అధ్యక్షుడి అవతారం
-అక్రమ బదిలీ నిర్దారించిన విజిలెన్స్
-ఎన్నికలే జరగని ఏపీఎన్జీఓ సంఘానికి గుర్తింపు లేని అధ్యక్షుడు
-హౌజింగ్ సొసైటీలో సభ్యత్వమూ అక్రమమే

హైదరాబాద్, ఆగస్టు 22 (టీ మీడియా):హైదరాబాద్‌కు ఆయన బదిలీ నిబంధనలకు విరుద్దమనేందుకు కొన్ని పత్రాలు ‘టీ మీడియా’ చేతికి అందాయి. అశోక్‌బాబుతోపాటు ఏపీఎన్జీవో హైదరాబాద్ అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ కూడా ఇలాగా ఉద్యోగం సంపాదించాడనే ఆరోపణలున్నాయి. ప్రస్తుత ఎపీఎన్జీవో అధ్యక్షుడి హోదాలో ఉన్నట్లుగా చెలామణి అవుతున్న పరుచూరి అశోక్‌కుమార్ కృష్ణా జిల్లా విజయవాడలోని వాణిజ్య పన్నుల శాఖ డిప్యుటీ కమిషనర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించేవారు. తదుపరి పోస్టింగ్ అయిన అసిస్టెంట్ కమిర్షియల్ టాక్స్ అధికారి(ఏసీటీఓ) హోదా కోసం తప్పుడు విధానాన్ని అనుసరించి హైదరాబాద్‌కు వచ్చినట్లు సహచర ఉద్యోగులు చెబుతున్నారు. వాస్తవానికి ఏసీటీవో హోదా కోసం ఏదేని డిగ్రీ ఉత్తీర్ణత లేదా శాఖాపరంగా బుక్ కీపింగ్ అర్హత కలిగి ఉండాలి. కానీ ఈ రెండింటిలో అశోక్‌బాబుకు ఏ ఒక్క అర్హత లేకపోవడం గమనార్హం. ఇక ఆయన బదిలీకి ఎంచుకున్న వక్రమార్గంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో పర్చూరి అశోక్‌బాబు దొంగ సర్టిఫికెట్లు సమర్పించినట్లుగా…సర్వీస్ రికార్డులో మార్పులు చేర్పులు చేసినట్లుగా స్పష్టంగా రుజువైంది. విజిలెన్స్ విచారణలో ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవాలేనని…ఆయన అక్రమాలు ఒకటి రెండూ కావని విజిలెన్స్ విచారణ నివేదికను ప్రభుత్వానికి అందించింది.

వీటిపై విచారణ చేసిన రెవెన్యూ విజిపూన్స్ శాఖ తేదీ 30, జనవరి 2013న ప్రభుత్వానికి నివేదిక(మెమో నెం.1716/విజిలెన్స్-1(2)2013-1లో అందజేసింది. అశోక్‌బాబుపై వచ్చిన ఆరోపనలన్నీ వాస్తవాలేనని…ఆయన అక్రమాలకు పాల్పడి ప్రభుత్వాన్ని మోసం చేశారని ఈ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయం ఆయనపై వచ్చిన ఆరోపణలు వాస్తవం అని తేలుస్తూ మొమోను జారీ చేసింది. ఇందులో సర్వీసు రిజిస్టర్‌లో పేజి నెంబర్ 6లో ఇంటర్మడియట్ చిదివినట్లు ఉందని వాణిజ్య పన్నుల శాఖ తేల్చింది. అయితే ఆయన ఇందుకు భిన్నంగా డిగ్రీ చదివినట్లగా ఎలా డిక్లరేషన్ ఇచ్చారని ప్రశ్నించింది. ఇందుకు 15 రోజుల్లో సమాధానం చెప్పాలని మెమోలో పేర్కొంది. అయితే ఆయన డిగ్రీ చదివినట్లు తప్పుడు దృవీకరణ ఇచ్చి 2008 ఫిబ్రవరి 11 న ప్రభుత్వం నిర్వహించిన సాంకేతిక పరీక్ష ఎందుకు రాశారని, డిగ్రీ చదివిన వారికి ఈ పరీక్ష అవసరం లేదని కమిషన్ చురకలు వేసింది. ఈయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయినా ప్రభుత్వం ఎందుకో మిన్నకుండి పోతోంది. ఇక్కడ ఇంకో గమ్మత్తయిన విషయం ఏమిటంటే ఏపీఎన్జీఓ హౌజింగ్ సొసైటీలో సభ్యత్వానికి వాస్తవానికి అశోక్‌బాబు అనర్హుడు.

2012 ఆగష్టులో టెన్యూర్ విధానంద్వారా హైదరాబాద్‌కు బదిలీపై వచ్చిన ఆయన 22 జనవరి 2010న ఏపీఎన్జీఓ హౌజింగ్ సొసైటీలో సభ్యత్వం పొందినట్లుగా రికార్డులు సృష్టించడం విమర్శలకు తావిస్తోంది. ఇది ఎలా సాధ్యమని సొంత ఉద్యోగ సంఘాల నేతలే ఆరోపణలు చేసున్నా ఆయన నోరుమెదపడం లేదు. దీనిపై కోర్టులో కేసు విచారణలో ఉంది. వాస్తవానికి నిబంధనల ప్రకారమయితే ఇందులో సభ్యత్వానికి సొసైటీ ఏర్పాటయ్యేనాటికి హైదరాబాద్‌లో 5ఏళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి. కానీ ఇవేవీ ఆయనకు వర్తించలేదు. తెలంగాణ విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యంగా కలిసుందామని ఉద్యమిస్తున్న అశోక్‌బాబు తెలంగాణ పోస్టును కొల్లగొట్టి…అక్రమంగా ఉద్యోగాన్ని అనుభవిస్తున్నాడు. విజిపూన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ విభాగంలో 22 పోస్టులు ఉండగా విజయవాడ డివిజన్లో ఈయన విధులు నిర్వహించాల్సి ఉండగా ఈ కోటాలో కాకుండా తెలంగాణ కోటాలో ఆయన నియామకం కావడం విశేషం. ప్రస్థుతం ఈయన సికింవూదాబాద్ డివిజన్లో పనిచేస్తున్నారు.

డిగ్రీ చదవకున్నా చదివినట్లు దొంగ సర్టిఫికేట్…

ఏపీఎన్జీఓ అప్రకటిత అధ్యక్షునిగా కొనసాగుతూ… అసలు ఎన్నికలే జరగని సంఘానికి అధ్యక్షునిగా చెప్పుకుంటున్న అశోక్‌బాబు ప్రభుత్వాన్ని మోసం చేసిన ఆరోపణలును ఎదుర్కొంటున్నారు. అనుభవం ప్రాతిపధికగా జిల్లాల్లో పనిచేసే ఉద్యోగులకు శాఖాధిపతుల కార్యాలయాలకు డెప్యు పంపేందుకు 12.5 శాతం కోటాను ప్రభుత్వం అమలుచేస్తోంది. ఇందుకు ఆయా ఉద్యోగులకు గ్రాడ్యుయేషన్(డిగ్రీ) తప్పనిసరి. ఇదే అంశంలో అర్హతలతో కూడిన విద్యార్హతల జాబితాలతో కూడిన అభ్యర్ధుల వివరాలను తమకు పంపాలని అన్ని శాఖల కమిషనర్లకు 1995 నవంబర్ 10న ప్రభుత్వం ఆదేశించింది.

సరిగ్గా ఇదే అంశాన్ని వాడుకొని హైదరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ కావాలని పథకం పన్నిన అశోక్‌బాబు తనకు లేని అర్హతలను సృష్టించుకున్నారు. డిగ్రీతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానంలో 1991లోవిజయవాడలోని ఎన్‌ఐఐటీ నుంచి డిప్లొమా ఇన్ సిస్టం మేనేజ్‌మెంట్ కోర్సును పూర్తి చేసినట్లుగా ప్రభుత్వానికి తప్పుడు డిక్లరేషన్‌ను సమర్పించాడు..అయితే సర్వీస్ రికార్డుల్లో మాత్రం ఆయన ఇంటర్‌మీడియెట్ మాత్రమే చదివినట్లుగా ఉండటంతో అనుమానం వచ్చిన అధికారులు దీనికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్లు, సర్వీస్ రిజిస్టర్‌ను పంపాలని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టెలిగ్రాంద్వారా ఆదేశించారు. దీంతో బెంబేలెత్తిన అశోక్‌బాబు తన గుట్టు బయటపడుతోందని…ఇక దొరికిపోవడం ఖాయమని భావించి యూ-టర్న్ తీసుకుని..‘నాకున్న కుటుంభపరమైన కారణాలవల్ల నేను హైదరాబాద్(హెచ్‌ఓడీ)లో పనిచేసేందుకు సుముఖంగా లేను…నా ధరఖాస్తును ఉపసంహరించుకుంటున్నాను’ అని ప్రభుత్వానికి పంపిన అభ్యర్ధనలో పేర్కొన్నారు. ఇక అక్కడే ఆయన మరో మోసానికి తెగబడ్డారు.

ఆయన చేసిన మోసాన్ని ఆయనే బట్టబయలు చేసుకుని సాంకేతికంగా మరోసారి దొరికిపోయారు. వాస్తవానికి ఇన్‌సర్వీస్ కేడర్‌లో వాణిజ్య పన్నుల సహాయ కార్యదర్శిగా నియామకానికి ప్రభుత్వం నియమించే ఇన్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి…అయితే ఇందుకు డిగ్రీ చదవని వారు మాత్రమే పరీక్ష రాయాలి…డిగ్రీ చదివినవారు దీనిని రాయాల్సిన అవసరం లేదు. అయితే గమ్మత్తుగా డిగ్రీ ఉత్తీర్ణత అయ్యానని చెప్పుకున్న అశోక్‌బాబు ఈ పరీక్ష రాసి ఉత్తీర్ణుడు కావడంతో ఆయన మోసాన్ని ఆయనే దృవీకరించుకున్నారు. గతంలో ఒక ఉద్యోగి ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది.‘ప్రత్యక్షంగా లబ్ది పొందకపోయినా సరే తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ప్రభుత్వాలను మోసం చేయాలని చూస్తే సదరు ఉద్యోగి ఆ ఉద్యోగంలో కొనసాగేందుకు అనర్హుడ’ని పేర్కొంది. 1996లో తప్పుడు డిక్లరేషన్ ఇచ్చిన అశోక్‌బాబును ప్రభుత్వం ఉపేక్షించడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎన్నికలే జరగలేదు…అధ్యక్షుడెలా అయ్యాడో….

రాష్ట్రంలో 100కుపైగా గుర్తింపు ఉద్యోగ సంఘాల్లో ఒకటిగా ఉన్న ఏపీఎన్జీకు 31మే 2013 వరకు గోపాల్‌డ్డి అధ్యక్షుడిగా కొనసాగారు. అయితే అదే తేదీన ఆయన పదవీవిరమణ చెందడంతో ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. దీంతో ఏలూరు ఏపీఎన్జీఓ అధ్యక్షుడు భోగరాజు ఎన్నికల అధికారిగా మే 26న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఎన్నికలను సవాలు చేస్తూ కొందరు ఉద్యోగులు 2013 జూన్ 20న సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఇంటెరియం ఇంజక్షన్ ఉత్తర్వులను జారీ చేస్తూ అదేతేదీన అదనపు చీఫ్ జడ్జి ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. అసలు ఎన్నికలే జరగని సంఘానికి అశోక్‌బాబు ఎలా అధ్యక్షుడయ్యాడో ఆయనే చెప్పాలి.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *