mt_logo

సోషల్ మీడియా ట్రెండింగ్ లో “రైతుబంధుకేసీఆర్”

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ద్వారా రైతులకు అందిస్తున్న పెట్టుబడి సాయం 50 వేల కోట్లకు చేరింది. దీంతో సోషల్ మీడియాలో వేలమంది రైతుబంధు కేసీఆర్‌ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఎన్నారైలు, రైతులు రైతుబంధు కార్యక్రమాన్ని, రైతు సంక్షేమం పట్ల సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధిని ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. దీంతో దేశంలో టాప్‌ ట్రెండింగ్‌లో రైతుబంధు కేసీఆర్‌ నిలిచింది. పలు జిల్లాల్లో రైతు వేదికలు, వ్యవసాయ మార్కెట్లు, పంట పొలాలు, సంకాంత్రి ముగ్గులతో నిర్వహించిన సంబురాల ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు చేసిన ట్వీట్లు :

అన్నదాతకు అండగా, రైతు సంక్షేమంలో దేశానికి స్ఫూర్తిగా, సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు ద్వారా ఇప్పటివరకు అందించిన మొత్తం రూ.50 వేల కోట్లకు చేరుకున్నది. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు, రైతన్నలకు శుభాకాంక్షలు అన్నారు ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు.

ఒక కన్ను అప్పుకోసం.. ఒక కన్ను వాన కోసం.. నాడు రైతుల ఎదురుచూపులు. నేడు ఒక చెయ్యి రైతుబంధు కోసం.. ఒక చెయ్యి సేద్యంకోసం.. నీళ్లకు కాళ్లొచ్చినయ్‌. నేలకు నవ్వొచ్చింది. రైతుబంధు సాయంతో బంగారు తెలంగాణ ఆవిష్కృతం అవుతున్నదన్నారు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి.

రైతన్నకు ఆర్థిక తోడ్పాటు అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టి ‘రైతుబంధు’ పథకం ద్వారా నాలుగేండ్లలో 50 వేల కోట్లు అందించిన సీఎం కేసీఆర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌.

అన్నదాతల కోసం సీఎం కేసీఆర్‌ ఇప్పటివరకు 50వేల కోట్లు పంపిణీ చేయడం అంటే.. ఇది దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గర రోజు అని తెలియజేశారు ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌.

రైతుబంధు పథకం ద్వారా పంట పెట్టుబడి సాయం అందిస్తూ రైతు బాంధవుడిగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.

ఒకవైపు కాళేశ్వరం లాంటి సాగునీటి ప్రాజెక్టులు.. మరోవైపు రైతుకు దన్నుగా రైతుబంధు.. రాష్ట్రంలో వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసి వందేండ్ల భవిష్యత్‌ తెలంగాణకు భరోసా ఇచ్చింది రైతుబంధు మాత్రమే అన్నారు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌.

రైతుబంధు పథకం కింద రైతులకు నేటితో రూ.50వేల కోట్లు లబ్ధి చేకూరిన సందర్భంగా సీఎం కేసీఆర్‌కు
కృతజ్ఞతలు తెలియజేశారు విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి.

అన్నదాతకు అండగా, రైతు సంక్షేమంలో దేశానికే స్ఫూర్తిగా ప్రవేశపెట్టిన రైతుబంధు ద్వారా అందించిన మొత్తం 50వేల కోట్లకు చేరుకున్న సందర్భంగా రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌.

చరిత్ర లిఖించిన రైతుబంధు. రైతుబాంధవుడిగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు మైనార్టీ, ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌.

బంగారు తెలంగాణ సాధన దిశగా కేసీఆర్‌ మానస పుత్రిక రైతుబంధు ద్వారా అన్నదాతలకు అందిన పంట పెట్టుబడి సాయం 50 వేల కోట్లకు చేరుకున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు.. జై తెలంగాణ.. జై కేసీఆర్‌ అన్నారు ఎమ్మెల్సీ కవిత

స్వరాష్ట్రంలో రైతు రాజయ్యాడు. సీఎం కేసీఆర్‌ దక్షతతో సాగు సంబురమైంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి.. దేశానికి ఆదర్శంగా నిలిపింది రైతుబంధు పథకం అన్నారు టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *