mt_logo

జూన్ 28 నుండి రైతుబంధు నిధులు జమ : సీఎం కేసీఆర్

వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపికబురు తెలిపింది. ఈ వానాకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను ఈనెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేయనున్నది. ఈ సందర్భంగా రాష్ట్ర రైతులందరి తరపున వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియజేసారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *