mt_logo

కుంభకోణం జరిగిందని ప్రశ్నిస్తే కేసులా? రేవంత్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ 

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ ఫోన్‌ని నిన్న పోలీసులు సీజ్ చేయడాన్ని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు.

కుంభకోణం జరిగిందని ఆరోపణ వస్తే ఆధారాలతో స్పందించాల్సింది పోయి దౌర్జన్యంగా అక్రమ కేసు పెట్టి సెల్ ఫోను సీజ్ చేయడమేంటని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.

అంటే కుంభకోణం బరాబర్ జరిగిందన్న మాట. దాని నుండి ప్రజల దృష్టి మరలించడానికే యువ నేత, తెలంగాణ పోరాట యోధుడు క్రిశాంక్ ఫోను సీజ్ చేశారు. దీన్నే పోలీసు భాషలో ‘Attention Diversion MO’ అంటరు అని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

ఈ గ్యాంగులు బ్యాంకుల ముందు తచ్చాడుతూ ఖాతాదారుల మీద రంగు చల్లి వాళ్ల  పైసలనెత్తుకొని పారిపోతారు. ఈ గ్యాంగులు నేడు తెలంగాణలో రాజ్యమేలుతున్నవి అని అభిప్రాయపడ్డారు.