mt_logo

ధ్వంసమైన అడవులను కాపాడిన దార్శనికుడు కేసీఆర్.. అటవీ దినోత్సవం సందర్భంగా కేటీఆర్ పోస్ట్

అటవీ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పాలనలో జరిగిన అటవీ అభివృద్ధిని గుర్తు చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

దశాబ్దాల పాటు ధ్వంసమైన అడవులను కంటికి రెప్పలా కాపాడిన దార్శనికుడు కేసీఆర్ గారు.. సమైక్య రాష్ట్రంలో ఆగమైన అడవిసంపద చుట్టూ అందమైన పచ్చని పందిరి అల్లిన ప్రకృతి ప్రేమికుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.

తెలంగాణలో మహోద్యమంలా సాగిన ఆనాటి హరితహారం.. 230 కోట్ల మొక్కలు నాటాలన్న సంకల్పం ప్రపంచ చరిత్రలోనే మూడో అతిపెద్ద మానవ ప్రయత్నం. సుమారు 15 వేల నర్సరీల పెంపకం మహాయజ్ఞంలో సరికొత్త అధ్యాయం అని కేటీఆర్ తెలిపారు

8% పెరిగిన గ్రీన్ కవర్ దేశ చరిత్ర లోనే నెవర్ బిఫోర్.. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ప్రజల బతుకుచిత్రాన్ని మార్చడమే కాదు.. చిక్కిశల్యమైన అడవులను, సకల జీవరాశులను సంరక్షించడమని నలుదిశలా చాటిచెప్పిన నాయకత్వం మనది అని గుర్తు చేశారు.