mt_logo

త్వరలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ప్రకటించిన కేసీఆర్

మాజీ ఐపీఎస్ ఆఫీసర్, బీఎస్పీ తెలంగాణ శాఖా మాజీ అధ్యక్షులు డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడారు.

బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్‌ను త్వరలోనే ప్రకటిస్తా.. భవిషత్తులో కూడా ఉన్నత స్థానంలో ఉంటాడు. ప్రవీణ్‌ను హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్న.. మంచి ఆశయం కోసం పనిచేసిన మీకు రాజకీయ సామాజిక ఫలితాలుంటాయి.. ఆచరణయోగ్యమైన కార్యాచనతో ప్రజల్లో కలిసి పని చేద్దాం.. ఫలితాలు సాధిద్దాం అని కేసీఆర్ తెలిపారు.

గురుకుల విద్యను అభివృద్ధి చేసి ప్రవీణ్‌కు ఎంతో సహకరించిన. దళిత బహుజన బిడ్డలను విద్యావంతులను చేసిన.. దేశ విదేశాల్లో వాళ్లు ఇవ్వాళ ఉన్నత స్థాయిలో ఎదిగారు అని అన్నారు.

బీఎస్పీ నుండి వచ్చినవాళ్ళకి ఏ పార్టీలో లేని స్పేస్ బీఆర్ఎస్‌లో ఉంటుంది.. నిరంతర శిక్షణ తరగతులు నిర్వహించుకుందాం, పార్టీ నిర్మాణం చేసుకుందాం.. కమిటీలు వేసుకుందాం.. మనం అద్భుతమైన విజయం సాధిస్తాం.. బహుజన సిద్ధాంతాన్ని, ఎజెండాని బలంగా అమలు చేసే దిశగా భారత దేశానికి టార్చ్ బేరర్‌గా పనిచేయాలే.. బహుజన బేస్‌ను నిర్మిద్దాం, ఒక అనివార్యతను సృష్టిద్దాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.

ప్రవీణ్ ఒక డెడికేటెడ్ పర్సన్.. రెసిడెన్షియల్ విద్యాసంస్థలను దేశానికే ఆదర్శంగా నిలిపాడు.. మనం కష్టపడితే.. వచ్చే టర్మ్ లో నూటికి నూరు శాతం బీఆర్ఎస్ గెలుస్తుంది అని అన్నారు.

దళిత శక్తిని ఏకం చేసేందుకు.. బలహీన వర్గాలను ఐక్యం చేసేందుకు మనం నడుం కడుదాం, కలిసి ఎజెండా తయారు చేద్దాం.. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వెనక్కుపోలె.. ఇప్పుడు కూడా అంతే ముందుకు పోదాం.. కన్విక్షన్ ఉంటే అసాధ్యం ఏమి వుండదు అని కేసీఆర్ పేర్కొన్నారు.