రాష్ట్రంలో పదవ విడుత రైతుబంధు నగదు సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు నుండి రైతుల అకౌంట్లలో జమ చేయడం ప్రారంభించింది. తొలి రోజు ఎకరం వరకు భూమి ఉన్న రైతుల్లో 21 వేల మందికి పైగా ఖాతాల్లో రూ.607 కోట్లు జమ చేశారు అధికారులు. కాగా ఈ యాసంగి సీజన్ కు సంబంధించిన రైతుబంధు నగదును ఈరోజు నుండి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని, ఈ విడతb70.54 లక్షల మంది రైతులు రూ.7676.61 కోట్ల లబ్ది పొందుతారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తన సొషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. నేడు 21,02,822 మంది రైతులకు రూ.607.32 కోట్లు జమచేశామని మంత్రి పేర్కొన్నారు.
