హైదరాబాద్‌లో గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్ లెన్స్ సెంటర్ తన రెండవ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు రోచే ఫార్మా సంస్థ ముందుకొచ్చింది. ఈ సంస్థ డేటా సైన్స్, అడ్వాన్స్ డ్ అనలిటిక్స్ సంబంధిత సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి పెట్టుబడి పెట్టనుంది. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో రోచే ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సింప్సన్ ఇమ్మాన్యుయేల్ సమావేశమయ్యారు.
రోచే ఫార్మా తమ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లను స్థాపించడానికి హైదరాబాద్‌ను ఎంచుకోవడం గర్వ కారణంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ దేశంలోనే అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థలను, అత్యంత నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులైన నిపుణులు, అత్యాధునిక మౌలిక సదుపాయాలను కలిగి ఉందన్నారు. ప్రభుత్వం గ్లోబల్ ఇన్నోవేషన్, కెపాబిలిటీ సెంటర్‌లకు ప్రాధాన్యతనిస్తుందన్నారు.