దేశంలోనే మొట్ట మొదటి సారిగా హైదరాబాద్ లో నిర్వహించనున్న ఫార్ములా -ఈ కారు రేసింగ్ పోటీల పనులు వేగంగా జరుగుతున్నాయి. బుధవారం రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హెచ్‌ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ ఫార్ములా -ఈ కారు రేసింగ్ ట్రాక్ నిర్మాణం పనులను పరిశీలించారు. హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీ.ఎల్.ఎన్.రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు లుంబినీపార్కు, ఎన్టీఆర్‌గార్డెన్, ఐమ్యాక్స్ ప్రాంతాలో జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించారు. అంతర్జాతీయ స్థాయి పోటీలు కావడంతో ట్రాక్ నిర్మాణ పనులను అదే స్థాయిలో చేపట్టాలని అధికారులను అర్వింద్‌కుమార్ ఆదేశించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం, ఏబీబీ ఫార్ములా ఈ, గ్రీన్‌కో సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం వేదికగా ప్రారంభించనున్న ఫార్మలా ఈ వరల్డ్ చాంపియన్‌షిప్ రేస్ ప్రారంభోత్సవంపై ఈ నెల 4న న్యూ ఢిల్లీలోని ది అశోకా హోటల్ లాన్‌లో సాయంత్రం 7గంటలకు సదస్సు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
