అగ్నిపథ్ రద్దు చేయాలంటూ జరిగిన ఆందోళనలో సికింద్రాబాద్ రైల్వే పోలీసుల కాల్పుల్లో చనిపోయిన దామెర రాకేశ్ సోదరుడు రామ్ రాజ్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రామ్ రాజ్ విద్యార్హతలకు అనుగుణంగా తగిన పోస్టులో నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. కారుణ్య నియామకం కింద వరంగల్ జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులో నియమించాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారక ఉత్తర్వులు జారీచేశారు. గత శుక్రవారం రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన సైనిక ఉద్యోగార్థి, వరంగల్ కు చెందిన రాకేశ్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు, ఆయన కుటుంబంలో అర్హులైనవారికి తగిన ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

