తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం ద్వారా ఇప్పటివరకు రైతుల ఖాతాల్లోకి 50 వేల కోట్లు జమచేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, రైతులు ఎడ్లబండ్ల ర్యాలీలు జరుపుతున్నారు. గ్రామగ్రామాల్లో ఎడ్ల బండిపై సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తూ, డప్పు చప్పుళ్లతో, మంగళహారతులతో సంబురాలు జరుపులుంటున్నారు.దేశంలో ఈ సీఎం కూడా రైతులను పట్టించుకోలేదని, రైతులకు పెట్టుబడి ఇస్తూ రైతును రాజు చేసిన సీఎం కేవలం కేసీఆర్ మాత్రమే అని, సీఎం కేసీఆర్ కు జన్మంతా రుణపడి ఉంటామని చెబుతున్నారు రైతులు.
“70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏనాడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గానీ, ప్రధానమంత్రి కాని చరిత్రలో ఎన్నడూ ఆలోచించని స్థాయిలో.. తెలంగాణ రైతుల గురించి సీఎం కేసీఆర్ ఆలోచించి తీసుకున్న గొప్ప కార్యక్రమం రైతుబంధు అని అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమైనాటి నుంచి ఈ నెల 10 నాటికి 50 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరబోతున్నాయన్నారు. రైతు బందు కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి రైతుల్లో ఎనలేని సంతోషంగా ఉన్నదని, రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఒక గొప్ప ఊతంగా మారిందన్నారు మంత్రి కేటీఆర్.”