రేపు, ఎల్లుండి తెలంగాణాలో భారీ వర్షాలు

  • October 16, 2021 5:08 pm

రాబోయే రెండు రోజులు తెలంగాణాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం, దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా.. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, వరంగల్‌, హన్మకొండ, ములుగు, మహబూబాబాద్‌, కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఆదివారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేస్తూ, ప్రజలు అవసరమైతే తప్ప బయటకి రావొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.


Connect with us

Videos

MORE