హైదరాబాదీ స్టార్ షట్లర్, వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్ పీవీ సింధు కామన్‌వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది. బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో కెనడా క్రీడాకారిణి వరల్డ్ నెంబర్ 14వ ర్యాంకర్ మిచ్చెల్ లీతో 21-15, 21-13 స్కోర్‌తో విజయం సాధించి పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. గేమ్ లో ముందునుంచి సింధు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి అన్ని రకాల షాట్స్ ఆడి, విజయాన్ని కైవసం చేసుకుంది. కాగా కామన్‌వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన పీవీ సింధుని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. తగిన ప్రోత్సాహం అందిస్తే ఎంతో మంది క్రీడాకారులు పతకాలు నెగ్గుతారని, అందుకు అనుగుణంగా తమ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలు నెలకొల్పుతుందని… విద్యార్థులను, యువకులను క్రీడల వైపు ప్రోత్సహిస్తామని సీఎం అన్నారు.