mt_logo

తెలంగాణకు మరో బుల్లెట్ ట్రైన్… బెంగుళూర్-హైదరాబాద్

తెలంగాణకు మరో బుల్లెట్ ట్రైన్ రాబోతోంది. ఇప్పటికే ముంబై-పూణే-హైదరాబాద్ కారిడార్లో బుల్లెట్ రైలు మార్గం నిర్మాణ పనులకు సిద్దమవబోతుండగా… ఇపుడు తాజాగా బెంగుళూర్ నుండి హైదరాబాద్ వరకు మరో మార్గానికి డీపీఆర్‌లు సిద్ధం చేస్తోంది రైల్వే శాఖ. దేశంలో ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా దేశంలో ఇప్పటికే ఎనిమిది కారిడార్లలో బుల్లెట్‌ రైళ్లు అందుబాటులోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. కాగా భవిష్యత్తు అవసరాలు, పెరుగుతున్న డిమాండ్‌ని పరిగణలోకి తీసుకుని మరో నాలుగు కారిడార్లలో బుల్లెట్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకు రానుంది. ఇందులో బెంగళూరు – హైదరాబాద్‌ (618 కి.మీ), నాగ్‌పూర్‌ – వారణాసి (855 కి.మీ), పట్నా – గువహాటి (850 కి.మీ), అమృత్‌సర్‌ – పఠాన్‌కోట్‌ – జమ్ము (192 కి.మీ) మార్గాలు ఉన్నాయి. వీటిని ఇప్పటికే నేషనల్‌ రైల్‌ ప్లాన్‌ 2022లో చేర్చారు. త్వరలో ఈ మర్గాల్లో బుల్లెట్‌ రైల్‌ నిర్మాణానికి సంబంధించి డీపీఆర్‌లు సిద్ధం చేయనున్నారు. ఈ కొత్త ప్రతిపాదన ద్వారా వివిధ నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. అయితే కేంద్రం అమలు చేస్తోన్న ఈ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులో గుజరాత్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలు ఎక్కువ లబ్ధి పొందనుండగా దక్షిణాది రాష్ట్రాలైన కేరళా, ఆంధప్రదేశ్‌లతో పాటు ఒడిషా, ఝార్ఖండ్‌లను పూర్తిగా విస్మరించారని, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, జమ్ము కశ్మీర్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు కంటితుడుపు చర్యలా బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులు ఉన్నాయని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *