mt_logo

పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న ఒడిశా ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఏర్పాటు చేసింది. అయితే మొదట్నుంచీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న ఒడిశా ప్రభుత్వం తాజాగా పీపీఏ ఏర్పాటుకు నిరసనగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధమైంది. పోలవరం అంశం న్యాయపరిధిలో ఉన్నప్పటికీ కేంద్రం పీపీఏ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్లు ఒడిశా జలవనరుల శాఖ కార్యదర్శి సురేష్ మహోపాత్ర బుధవారం విలేకరులకు తెలిపారు. గతంలో కూడా పోలవరం ప్రాజెక్టును సవాల్ చేస్తూ ఒడిశా ప్రభుత్వం 4 కేసులు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *