mt_logo

ఇండియాలో ప్లగ్ అండ్ ప్లే తొలి కార్యాలయం హైదరాబాద్ లో.. ఇక దేశంలోనే ఐటీకి కేరాఫ్ అడ్రెస్ అవనున్న భాగ్యనగరం

ఫ్రాన్స్ లోని పారిస్ నగరంలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం అవుతోంది. శనివారం జరిగిన సమావేశాల అనంతరం స్టార్టప్‌లకు ఇంక్యుబేషన్ సెంటర్ గా పనిచేసే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ప్లగ్ అండ్ ప్లే సంస్థ ఇండియాలో తమ తొలి కార్యాలయాన్ని హైదరాబాద్ లో ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే ఐటీ దిగ్గజాలైన యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ సంస్థల కార్యాలయాలు హైదరాబాద్ లో కొలువు దీరగా తాజాగా ప్లగ్ అండ్ ప్లే వచ్చి చేరింది. కాగా “హైదరాబాద్‌లో దేశంలోనే పెద్దదైన టీ హబ్‌ ఇంక్యుబేషన​ సెంటర్‌ ఇదివరకే ఉండగా.. ఇప్పుడు ప్లగ్‌ అండ్‌ ప్లే రావడం వల్ల హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో కొత్త ఆవిష్కరణలకు ఊతం లభిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సత్వర మరియు పారదర్శక అనుమతులు, మరియు తెలంగాణాలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పన వల్లే ఇది సాధ్యమైంది” అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఇక ఇండియాలో హైదరాబాద్ ఏకైక ఆప్షన్ :

హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే ప్లగ్ అండ్ ప్లే సంస్థ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, స్మార్ట్‌ సిటీస్‌ మీద పని చేస్తున్న స్టార్టప్‌ సంస్థలకు ఇంక్యుబేషన్‌ సెంటర్‌గా పని చేస్తుంది. దీంతో పాటు మొబిలిటీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విభాగాల్లో కృషి చేస్తున్న స్టార్టప్‌లు నిలదొక్కుకునేలా ఎకో సిస్టమ్‌ని అభివృద్ధి చేస్తుంది. తర్వాతి దశలో ఫిన్‌టెక్‌, హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌ రంగాలపై ఫోకస్‌ చేయనుంది. ప్లగ్‌ అండ్‌ ప్లే కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో స్టార్టప్‌ కంపెనీలకు హైదరాబాద్‌ ఏకైక ఆప్షన్‌గా అయ్యే అవకాశం ఉంది.

ప్లగ్‌ అండ్‌ ప్లే :

ప్లగ్‌ అండ్‌ ప్లే సంస్థ ఇప్పటి వరకు 35వేల స్టార్టప్‌లకు అండదండలు అందించింది. ఇందులో 530 కంపెనీలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా లీడింగ్‌ కార్పోరేట్‌ కంపెనీలుగా ఉన్నాయి. వెంచర్‌ ఫండింగ్‌ ద్వారా ఇప్పటి వరకు 9 బిలియన్‌ డాలర్ల పెట్టుబడిని స్టార్టప్‌ కంపెనీలకు తెచ్చి పెట్టింది. అమెరికా, జర్మనీ, జపాన్‌, చైనా, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌లలో ఈ కంపెనీ కార్యాలయాలు ఉన్నాయి. ఏషియాలో జపాన్‌, చైనా తర్వాత ఇండియాలో మూడో కార్యాలయం నెలకొల్పబోతుంది.

లాభాలివే :

* ఇండియన్‌ స్టార్టప్‌ కంపెనీలకు హైదరాబాద్ ప్లగ్‌ అండ్‌ ప్లే కార్యాలయం గేట్‌గా మారనుంది. అంకుర పరిశ్రమలకు ఇంటర్నేషన్‌ స్థాయిలో మద్దతు వచ్చేలా పని చేస్తుంది.
*ఇండియా, ఇంటర్నేషనల్‌ స్థాయిలలో ఉన్న కార్పొరేట్‌ కంపెనీలకు స్టార్టప్‌లను అనుసంధానం చేసేందుకు ఉపకరిస్తుంది.
* ఇండియన​ స్టార్టప్‌లకు వెంచర్‌ క్యాపిటలిస్టుగా ఉపయోగపడుతుంది.
* స్టార్టప్‌ల క్రాస్‌ కొలాబరేషన్‌కి వేదికగా మారుతుంది.

బెంగళూరును ఓవర్ టేక్ చేసి :

ఒకప్పుడు విప్రో, ఇన్ఫోసిస్‌, ఓలా, ఫ్లిప్‌కార్ట్‌, బయోకాన్‌ లాంటి ప్రముఖ సంస్థలన్నీ బెంగళూరులోనే స్టార్టప్‌లుగా ప్రారంభమై.. ఈ రోజు భారీ కార్పొరేట్‌ కంపెనీలుగా ఎదిగాయి. లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ, పన్నుల రూపంలో ఆ రాష్ట్ర ఖజానా నింపుతున్నాయి. టీ హబ్‌తో పాటు ప్లగ్‌ అండ్‌ ప్లే హైదరాబాద్‌కి రావడం ద్వారా అనేక స్టార్టప్‌లు హైదరాబాద్‌కి వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఫ్యూచర్‌ టెక్నాలజీగా చెప్పుకుంటున్న ఐఓటీ, మెషన్‌ లెర్నింగ్‌, అర్టిఫిషీయల్‌ ఇంటిలిజెన్స్‌, ఫిన్‌టెక్‌, హెల్త్‌కేర్‌, మొబిలిటీ రంగాల్లో భవిష్యత్తు కార్పొరేట్‌ కంపెనీలకు హైదరాబాద్‌ అడ్రస్‌ అయ్యే గొప్ప అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *