ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు, ప్రకటనల కోసం డబ్బులను వృధాగా ఖర్చు చేయొద్దని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ఒక మొక్కను నాటి సీఎం కేసీఆర్ పై తమకున్న అభిమానం చాటుకోవాలని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.