mt_logo

పాలమూరు ప్రాజెక్టుకు అటవీ అనుమతులు మంజూరు…

పాలమూరు-రంగారెడ్డి ప్ర్రాజెక్టుకు రెండవ దశ అటవీ అనుమతులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ వ్రాసింది. ఈ లేఖను కేంద్ర అటవీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్ శర్మ తెలంగాణ రాష్ట్ర అధికారులకు పంపారు. పాలమూరు ప్రాజెక్టుకు రెండవ దశ అటవీ అనుమతులు మంజూరు కావడంపై ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం శ్రీ కేసీఆర్ కేంద్రమంత్రి హర్షవర్ధన్ కు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు అనుమతుల కోసం కృషి చేసిన తెలంగాణ సాగునీటి, అటవీశాఖ అధికారులకు కూడా ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *