సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన జాతీయ ఓటరు దినోత్సవంలో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద ఈవీఎం ఇక్కడ ఏర్పాటు చేసి ఓటరు దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని, ఎన్నికలప్పుడు ఓటు వేసి మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాలని సూచించారు. ఇది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని అన్నారు. వృద్ధులు, వికలాంగులు కూడా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారని హరీష్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.