mt_logo

ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి!

By: సవాల్ రెడ్డి

అఖిలపక్షం ముగిసినప్పటినుంచి పాపం ఓ సామాజిక వర్గం చానెళ్లు ఒకటే ప్రచారం. టీడీపీ తెలంగాణకు అనుకూలమని లేఖ ఇచ్చిందని, ఇక ఎదురులేదని, లేఖతో టీడీపీ బాప్టిస్మము పొందినట్టే, పాపాలనుంచి విముక్తమైనట్టేనని.

ఎన్టీవీ వాడైతే రెండు కళ్ల సిద్దాంతం ఇక టీడీపీది కాదట. తెలంగాణ పై తేల్చిందట. ఇక తెలంగాణలో ఎదురే లేదట. టీఆర్ఎస్ గడగడా వణికి పోతుందట.

ఎంత కమ్మటి కల. ఉరికంబం ఎక్కేముందు కసబ్ కూడా కని ఉండడు ఇంత ఆశావాద కలలు. అటు ఆంధ్రలో ఇటు తెలంగాణలో డిపాజిట్ అనే పదార్థం ఎలా ఉంటుందో ఐదేళ్లుగా ఎరగని ఆ పార్టీ ఏకంగా అధికారంలోకి వచ్చేసినట్టు తమ సామాజిక వర్గం రాజ్యం చేస్తున్నట్లు… అబ్బ సొత్తులా హైదరబాద్ భూములను ఆరగించేస్తున్నట్టు…పైరవీలు పైసలు తెగ లాగేస్తున్నట్ట…కలల మీద కలలు.

ఇక చంద్రబాబుకు తెలంగాణలో బ్రహ్మరథమట. వచ్చే ఎన్నికల్లో సీట్లే సీట్లట. టీఆర్ఎస్ పని అయిపోయినట్టు కేసీఆర్ తెర వెనక్కి పోయినట్టు ఇక తెలంగాణవాదం మిగలనట్ట్టు. ఇక ఈ సీట్లో నాయుడు, ఆ సీటుకు చౌదరి, పక్క సీటు పాపకు, ఎడమ సీటు చిన్నబ్బాయికి…అంతా దున్నేసినట్టు…ఓటర్లంతా గుద్దేసినట్టు… వాహ్!

కలలు కనండి…కలలు కనండి…కనండని కలాం చెబితే ఏమో అనుకున్నా. ఇదా దానర్ధం!

ఈ లెక్కన బంగి అనంతయ్య ముఖ్యమంత్రి అవుతున్నట్టు. బాబూమోహన్ ప్రధాని అవుతున్నట్టు కూడా ప్రచారాలు చేయొచ్చు.

అక్కమెగుడు అడుక్కు తింటుంటే చెల్లెలి మొగుడొచ్చి చేతులు జాపినట్టు బాబుకు దిక్కులేదు. బాబు కొడుకు సిఎం అట. ఫేస్ బుక్ లో ఆ వర్గం ప్రచారం. అద్దంలో మొహం చూసుకుని ఉంటాడా ఎప్పడైనా ఆ బుడ్డోడు.

ఇక మరోవైపు ఆ బుడ్డోన్ని ఎత్తుకునే కార్యక్రమం రోజంతా. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అటెండర్ పోస్టు అంటూ అదేదో గొప్ప వ్యాఖ్యానమైనట్టు రోజంతా స్రోలింగ్లు. ఇంతకూ టీడీపీ ఇచ్చిన లేఖ ఏన్దిరా అంటే ఈ టీవీల్లో చూపెపట్టరు. మద్దతు అంటారు. లేఖ చూస్తే అందులో మద్దతు అనే సౌండ్ ఎక్కడా కనిపించదు. అలాంటప్పుడు “లోకేష్ ఇలా అన్నాడు… లేఖ ఇలా ఉంది’ అని వివరించాలి కదా జర్నలిస్టు అనే వాడు? అబ్బే బాబు గారు ఆయన కొడుకు తమ సామాజిక వర్గ సార్వభౌముడు ఆ మాట అంటారా.

2008లో ఇచ్చిన లేఖను 2009 డిసెంబర్ 9న తుంగలో తొక్కిన బాబు ఇపుడు ఆ లేఖ మీ దగ్గరే ఉందని అంటే అది తెలంగాణకు కట్టుబడినట్టా? అని నిలదీయాలి కదా “అప్పుడు పాటించలేదు, ఇప్పుడు పాటిస్తావని గ్యారెంటీ ఏమిటని? అడగాలి కదా?

అబ్బే బాబుగారిని అంతమాట అడుగుతారా… అడిగితే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెసరట్ల చాన్స్ పోదూ!

వినే వాళ్లు వెర్రి వెధవలైతే చెప్పే వాళ్లు చంద్రబాబు తాబేదార్లని…

మరోవైపు టీడీపీకి తెలంగాణలో బలమైన కేడర్ ఉందంటూ ఆంధ్రజ్యోతి వంటి కుల పత్రికలనుంచి హెచ్ఎంటీవీ వంటి ఆస్థాన పురోహిత టీవీల దాకా ఒకటే ప్రచారం. అంత బలమైన కేడరే ఉంటే, ఏ ఎన్నికల్లోనూ డిపాజిట్ కూడా ఎందుకు రావడం లేదట? బలమైన ఓటు బ్యాంకును స్విస్ బ్యాంకులో దాచుకున్నారా? లేక మనీ ట్రాన్స్ ఫర్ స్కీమ్ లాగా ఇతర పార్టీలకు ట్రాన్స్ ఫర్ చేసుకున్నారా? బలమైన కాడరే ఉంటే ఆదిలాబాద్ పర్యటనలో ఎక్కడా పది మంది జనం కూడా ఎందుకు రాలేదు?. నిలదీయడానికి వచ్చిన యువకులు తప్ప? కంగారుపడి కరీంనగర్ నుంచి డబ్బులుపోసి ఎందుకు తరలించుకుంటున్నట్టు? ఆరోజు పాదయాత్రకు ఎంత మంది జనం వస్తున్నారని ముందే ఎందుకు వాకబు చేసుకుంటున్నట్టు?

ఇచ్చిన మాట తప్పి వెయ్యిమంది ఉసురు పోసుకున్న చంద్రబాబును ఇంకా తెలంగాణలో నమ్మే వాళ్లున్నారా? పిచ్చి కలలు…పిచ్చి కథలు… తలకిందులుగా తపస్సు చేసినా బాబును తెలంగాణ ప్రజలు నమ్మరు…నమ్మరు…నమ్మరు… సీట్టు కాదు డిపాజిట్లు కూడ ఇక్కడ రావు… మీ సామాజికవర్గ చానెళ్ల ప్రచారం ఇక్కడ ప్లస్ సంగతేమో కానీ…ఆంధ్రలో ఉన్న గోచీ కూడా గల్లంతు చేస్తుంది!

ధర్మం జయిస్తుంది. అధర్మం నశిస్తుంది!

అయినా పిచ్చి లోకేష్ ఎన్టీఆర్ భవన్ లో అటెండర్ పోస్టులెక్కడ ఖాళీ ఉన్నాయ్? ఇన్ని టీవీల పత్రికలఎడిటర్లు రిపోర్టర్లున్నారు? టీ టీడీపీ నాయకులున్నారు? మళ్లీ రిక్రూట్మెంట్లు ఎందుకు చెప్పూ పాపం వీళ్ల పొట్టకొట్టడమెందుకు?

Cartoon Courtesy: Shankar Pamarthy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *