mt_logo

తెలంగాణలో 250 కోట్లు పెట్టుబడి పెట్టనున్న వన్ మోటో

వన్ మోటో సంస్థ తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహన తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. వన్ మోటో సంస్థ 250 కోట్ల పెట్టుబడి పెట్టడం సంతోషంగా ఉందని రాష్ట్ర ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్ అన్నారు. సోమవారం రాష్ట్రంలో యూకెకు చెందిన సంస్థ వన్ మోటో ఎలక్ట్రికల్ వాహన తయారీ సంస్థ తయారు చేసిన వాహనాన్ని ఆయన విడుదల చేశారు. ప్రముఖ బ్రిటన్ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ వన్ మోటో ఓలాకు పోటీగా రాష్ట్రంలో భారీ ఎలక్ట్రిక్ వాహన తయారీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు సోమవారం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం (ఎంఒయు) కుదర్చుకుంది. హైదరాబాద్ శివారులో 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ కొత్త ఎలక్ట్రిక్ వాహన తయారీ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి ఈ కంపెనీ 250 కోట్ల మేర పెట్టుబడులను పెట్టనున్నట్లు ప్రకటించింది. అత్యాధునిక ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి సెమీ- రోబోటిక్స్ వంటి అధునాతన యంత్రాలతో కర్మాగారం నిర్మిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. వన్ మోటో ఇండియా సీఈఒ శుభంకర్ చౌదరి మాట్లాడుతూ.. ‘కొత్త తయారీ ప్లాంట్ తో మేము భారత్‌లోని వినియోగదారులకు సేవలందించడమే కాకుండా, వన్ మోటో అభివృద్ధి చేస్తున్న వాహనలను ఇతర ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈవీ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కోసం ప్రత్యేక నైపుణ్యం గల మానవ వనరులు అవసరం గనుక మేం తెలంగాణలో నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తాం. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో 500 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 2000 మందికి పరోక్ష ఉద్యోగాలను రానున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. తెలంగాణలో యూకేకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ నూతన సంవత్సరంలో మొదటి పెట్టుబడిని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. వన్ మోటో సంస్థ వారికి ధన్యవాదాలు అంటూ.. రాష్ట్ర ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ ను ‘వెల్ డన్’ అంటూ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *