mt_logo

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలో మరో ఆడియో లీక్

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కోసం బీజేపీ పన్నిన కుట్రకు సంబంధించి మరో ఆడియో లీక్‌ అయ్యింది. ఇప్పటికే ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో రామచంద్రభారతి మాట్లాడిన ఆడియో లీక్ కాగా, ఇప్పుడు మరో ఆడియో లీక్‌ కావడం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేగుతోంది. 27 నిమిషాల నిడివిగల ఈ ఆడియోలో నందు అనే వ్యక్తి రామచంద్రభారతి, సింహయాజులు అనే ఇద్దరు స్వామీజీలతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోళ్లపై చేసిన సంభాషణలు ఉన్నాయి.

ఆ ఆడియోలోని సమాచారం ప్రకారం.. పైలట్ రోహిత్‌రెడ్డి మరో నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చర్చించుకున్నారు. పైలట్‌కు ఒక రేటు, వెంట వచ్చేవారికి మరోరేటు ఇవ్వాలని, మునుగోడు పోలింగ్‌లోపు చేరితే వంద కోట్లు ఇవ్వాలని మాట్లాడుకున్నారు. రాష్ట్ర నేతలు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డిలకు అంత ప్రాధాన్యం లేదని, ఈ అంశాలను నేరుగా సెంట్రల్‌ డీల్‌ చేస్తుందని చెప్పుకున్నారు. గుజరాత్‌ ఎన్నికల ముందు మునుగోడు కోసం ఇంత రిస్క్‌ తీసుకుంటున్నామని చర్చించుకున్నారు.

ఒక్కసారి ఎంట్రీ అయితే అన్ని అమిత్‌ షానే చూసుకుంటారని, రోహిత్‌ వెంట ముగ్గురు వచ్చేందుకు రెడీగా ఉన్నారని, చేవెళ్ల, కొడంగల్‌, పరిగి ఎమ్మెల్యేలనూ టచ్‌ చేశామని, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉంటేనే ఆపరేషన్‌ సక్సెస్‌ అవుతుందని వారు డిస్కస్‌ చేశారు. ముందుగా నలుగురు, ఆ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు వస్తారని ఈ సందర్భంగా నందకుమార్ రామచంద్రభారతికి హామీ ఇచ్చాడు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *