mt_logo

తెలంగాణలో మరోసారి మహాకూటమి?

త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని తెలుస్తుంది. తెలంగాణలో టీఆర్ఎస్ తో కలిసి నడవడానికి వామపక్షాలైన సీపీఐ, సీపీఎం పార్టీలు రెండూ సిద్ధంగా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే ఎన్నికలకు సిద్ధమైనా, లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కలిసి పోటీ చేయడానికి టీఆర్ఎస్, వామపక్షాలు జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి. కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ పొత్తు కుదుర్చుకోవాలని రాష్ట్రానికి చెందిన సీపీఐ నేత ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాకపోతే సీపీఎం మాత్రం కాంగ్రెస్ పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉందని, అయినప్పటికీ ఎన్నికలు దగ్గరబడేలోపు చివరి నిమిషంలో అయినా తమతో కలిసి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశమంతా కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత వ్యక్తమౌతున్నా, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పటిష్ఠంగా ఉందని సీపీఐ నేతల అభిప్రాయం. మున్సిపల్ ఎన్నికల తర్వాతే మహాకూటమి ప్రయత్నాలు జరుగుతాయని అంచనా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *