టీఆర్ఎస్ పార్టీ తరపున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయాలని కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సున్నితంగా తిరస్కరించారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని కేసీఆర్ ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్నికల్లో పోటీ చేయనని, తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకుంటూ వాచ్ డాగ్ లా పనిచేస్తానని ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని తెలంగాణ ఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ కూడా కేసీఆర్ కు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో నాలుగున్నర లక్షల మంది ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సి ఉందని, కనుక ఇప్పుడే రాజకీయాల్లోకి రాలేమని కేసీఆర్ తో అన్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న జేఏసీ కోచైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు పిడమర్తి రవిలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.