చిత్తూరు జిల్లాలో తెలంగాణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. జిల్లాలోని పీలేరులో తెలంగాణ వ్యతిరేక అందోళన కారణంగా సకాలంలో వైద్యం అందక ఒక వృద్ధుడు మృతి చెందాడు.
సమైక్యాంధ్రకు మద్ధతుగా పీలేరులో గురువారం ఉద్యమ రాస్తారోకో జరిగింది. కావలిపల్లెకు చెందిన ఒక అనాధ వృద్ధుడు అస్వస్థతకు గురుకావడంతో స్థానికులు ఆయనను పీలేరులోని ఆసుపత్రికి ఆటోలో తీసుకుని బయలుదేరారు. అయితే పీలేరులోని నాలుగు రోడ్ల కూడలి వద్దకు రాగానే సమైక్యాంధ్ర ఆందోళనకారులు నిర్వహిస్తున్న రాస్తారోకో కారణంగా ఆ ఆటో ట్రాఫిక్ లో చిక్కుకొనిపోయింది. దీనితో వృద్ధుడి ఆరోగ్య పరిస్థితి క్షీణించి ఆటోలోనే చివరిశ్వాస విడిచాడు.
సకాలంలో ఆసుపత్రికి తరలించి ఉంటే వృద్ధుడి ప్రాణాలు దక్కేవని స్థానికులు వ్యాఖ్యానించారు.