తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి సీమాంధ్రలో జరుగుతున్న ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధిక శాతం ఉండే ఉపాధ్యాయులు ఈ సమ్మెకు దూరంగా ఉండాలని నిర్ణయించారు.
ఉపాధ్యాయులు సమ్మెలో పాల్గొనరాదని నిర్ణయించడంతో ఏ.పీ.ఎన్.జీవోల సమ్మెకు తీవ్ర విఘాతం ఎదురైనట్లే. ఇప్పటికే అనేక జిల్లాల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మెపట్ల అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దీనితో సమ్మె భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
మంగళవారం నాడు హైదరాబాదులోని ఏపిటీఎఫ్ కార్యాలయంలో సమావేశమైన 11 ఉపాధ్యాసంఘాల ప్రతినిధులు సమ్మెలో పాల్గొనరాదని నిర్ణయించారు. ఈ మేరకు పత్రికా ప్రకటన కూడా జారీచేశారు. దాన్ని కింద చూడొచ్చు: