సీమాంధ్ర ప్రాంతంలో తెలంగాణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు వెర్రితలలు వేస్తున్న సంగతి మనం చూస్తున్నాం. తాజాగా బుధవారం అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టౌన్ లోని మన్యం జగ్గమ్మ సత్రం వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
అల్లరి మూకల దాడిలో విగ్రహం ముక్కు, తల భాగాలు దెబ్బతిన్నాయి.
స్థానిక వైశ్య సంఘాల సభ్యులు ఈ మూర్ఖపు చేష్టకు నిరసనగా ఇవ్వాళ విగ్రహం వద్ద నిరాహార దీక్షకు కూర్చున్నారు.