mt_logo

అక్టోబర్ 11, 12 తేదీల్లో టీఆర్ఎస్ ప్లీనరీ

వచ్చేనెల 11, 12 తేదీల్లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లీనరీని రెండురోజులపాటు ఘనంగా నిర్వహించాలని, మొదటి రోజు ఎల్బీ స్టేడియంలో పార్టీ ప్రతినిధులతో సమావేశం, మరుసటి రోజు సికింద్రాబాద్ జింఖానా మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొదట ప్లీనరీ సమావేశాన్ని ఈనెలే జరపాలని అనుకున్నా బతుకమ్మ పండుగ, దసరా పండుగలు ఉండటంతో కుదరలేదు. అంతేకాకుండా వచ్చేనెల 7 నుండి 9 వ తేదీవరకు అంతర్జాతీయ నగర మేయర్ల సదస్సు కూడా జరగనుండటంతో ప్రభుత్వం ప్లీనరీని వచ్చేనెల 11, 12 తేదీల్లో జరపాలని నిర్ణయం తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *