mt_logo

హైదరాబాద్ నగరానికి మరో కొత్త పాలసీ : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ మహా నగరం కోసం ఓ కొత్త పాలసీని సిద్ధం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. హెచ్ఎండిఏ మరియు జిహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, కుంటలు, జలవనరుల సంరక్షణ-అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. జలవనరులు సంరక్షణ చర్యల ద్వారా భవిష్యత్తు తరాలకు పచ్చదనం అందించడంతోపాటు ఆయా ప్రాంతాల ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ప్రపంచంలో అత్యుత్తమ నగరాలలో ఒకటిగా నిలిచి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన హైదరాబాద్ నగరం పరిసరాల్లోని చెరువులు వారసత్వ సంపదగా కాపాడేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన సమావేశంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ కు సూచించారు.

జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ పరిధిలో చెరువులు, కుంటలు ఆదరణకు నోచుకోకపోవడం, కొన్నింటిలోకి అనధికారికంగా సివరేజ్ చేరుతుంది. ఇలాంటి పరిస్థితులను అధిగమించి, పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న చెరువులు, కుంటల సంరక్షణ, అభివృద్ధి, పూర్వ వైభవం కల్పించే భాధ్యతలను స్థానిక డెవలపర్స్ కు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. లే అవుట్, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్, గేటెడ్ కమ్యూనిటీ, కమర్షియల్ కాంప్లెక్స్ వంటి వాటికి అనుమతి ఇచ్చే సమయంలో వారి డెవలప్ మెంట్ ఏరియాలో ఉన్న లేక్స్ అభివృద్ధి బాధ్యతలు వారే నిర్వహించాల్సి ఉంటుంది. వాటర్ బాడీకి 500 మీటర్ల పరిధి వరకు వాటి నిర్వహణ సంబంధిత డెవలపర్లు లేదా ఏజెన్సీలు అభివృద్ధి బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *