mt_logo

టీహబ్ నుండి కొత్త ఈ – బైక్ యాప్

టీహబ్‌లోని హలా స్టార్టప్‌ కంపెనీ ఎలక్ట్రిక్‌ బైక్‌ బుకింగ్‌ల కోసం రూపొందించిన యాప్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ ఆవిష్కరించారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ పర్యావరణవేత్త మహంకాళి శ్రీనివాస్‌రావు, టీహబ్‌ హైదరాబాద్‌ సీఈవో అజిత్‌ రంగ్నేకర్‌, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ రిసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ డాక్టర్‌ శాంత తౌటం పాల్గొన్నారు. హలా ఈ-బైక్‌ వినియోగదారుల రైడ్‌లు, చార్జింగ్‌ స్టేషన్లు, సర్వీస్‌ బుకింగ్‌లకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉండేలా ఈ యాప్‌ను రూపొందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *