mt_logo

ఎన్.డి.ఏ అంటే నో డాటా అవేలబుల్ గవర్నమెంట్ : మంత్రి కేటీఆర్

బీజేపీ నేతృత్వంలోని ‘ఎన్డీయే’ ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ కొత్త అర్థం చెప్పారు. కేంద్రం పార్లమెంటులో ప్రతి ముఖ్యమైన ప్రశ్నకు ‘సమాచారం లేదు’ (నో డాటా అవేలబుల్‌) అని సమాధానం ఇస్తుండటంతో ‘ఎన్డీయే అంటే నో డాటా అవేలబుల్‌ గవర్నమెంట్‌’ అని కొత్త నిర్వచనం ఇచ్చారు. కొవిడ్‌తో ఎంత మంది వైద్యసిబ్బంది మరణించారు? కరోనాతో ఎన్ని సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) మూతపడ్డాయి? లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీల మరణాలు ఎన్ని? రూ.20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్‌ ప్యాకేజీతో ఎవరెవరు లబ్ధిపొందారు? వ్యవసాయ చట్టాల రద్దు ఉ ద్యమంలో ఎంతమంది రైతులు మరణించా రు? వంటి ముఖ్యమైన ప్రశ్నలకు కేంద్రం చాలా సులభంగా ‘సమాచారం లేదు’ అని సమాధానం ఇస్తున్నది. దీంతో మంత్రి కేటీఆర్‌ కేంద్రానికి ఈ చురకలంటించారు. కాగా ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *