తెలంగాణ బిడ్డ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. నల్గొండ జిల్లాకు చెందిన శాలిగౌరం గ్రామానికి చెందిన కుతాటి గోపాల్ తాజాగా తమిళనాడు సీఎస్ గా నియమితులయ్యారు. 1992 బ్యాచ్ కు చెందిన గోపాల్ ట్రైనింగ్ అనంతరం తమిళనాడులో జాయింట్ కలెక్టర్ గా, కలెక్టర్ గా విధులు నిర్వహించారు. స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాక పశుసంవర్ధక శాఖ, రవాణా శాఖలో ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్నారు. ఇంతక ముందు సీఎస్ గా ఉన్న డా. వి ఇరై అన్బు పదవీకాలం ముగియడంతో ఇపుడు గోపాల్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. తమ గ్రామానికి చెందిన వ్యక్తి ఐఏఎస్ గానూ, ఇపుడు ఏకంగా ఓ రాష్ట్రానికి సీఎస్ అవడంతో శాలిగౌరారం గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
