కోవిడ్ పునరావాస కార్యక్రమాలకే ఎంపీ ల్యాడ్స్ నిధులు- కేకే

  • September 18, 2020 2:12 pm

కోవిడ్ పునరావాస కార్యక్రమాలకే ఎంపీ ల్యాడ్స్ నిధులు ఖర్చు చేయాలని ఎంపీ కేశవరావు స్పష్టం చేశారు. ఎంపీలు, మంత్రుల జీతాల కోత బిల్లుపై శుక్రవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలు తమ నిధులను ఒక ఏడాది పాటు స్వయంగా ఇచ్చేందుకు అంగీకరించామని గుర్తుచేశారు. సుమారు రూ. వంద కోట్ల ఎంపీ ల్యాడ్స్ నిధులను కేంద్రానికి ఇస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం సదరు కేంద్ర మంత్రికి కూడా తెలుసన్నారు. ఎంపీ నిధులపై కేంద్రం విధించిన షరతును వ్యతిరేకిస్తున్నా, తాము ఇచ్చిన నిధులను మాత్రం కోవిడ్ పునరావాస కార్యక్రమాలకే వాడాలని కేకే పేర్కొన్నారు.


Connect with us

Videos

MORE