కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్తగూడెం టౌన్, సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవి పల్లి మండలాల్లోని 105 మంది కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సుమారు రూ. కోటి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు కొండంత అండగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఉన్నాయని అన్నారు.
నిరుపేదల ఆడబిడ్డల పెండిండ్లు భారం కావొద్దనే సీఎం కేసీఆర్ ఈ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు వనమా రాఘవ, జిల్లా జెడ్పీ వైస్ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, స్థానిక నేతలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.