mt_logo

తెలంగాణ రాష్ట్ర సమితి అమెరికా శాఖను ప్రారంభించిన ఎంపీ కవిత..

అమెరికాలోని మిన్నియాపోలిస్ నగరంలో తెలంగాణ రాష్ట్ర సమితి అమెరికా విభాగాన్ని ఆదివారం నిజామాబాద్ ఎంపీ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, కళ్యాణ లక్ష్మి, ఆసరా వంటి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఎన్నారై టీఆర్ఎస్- యూఎస్ఏ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని, అమెరికాలోని అన్ని తెలంగాణ సంఘాలతో సమన్వయం చేసుకుని పని చేయాల్సిందిగా పార్టీ శ్రేణులకు సూచించారు. అనంతరం సభకు అధ్యక్షత వహించిన నాగేందర్ మహీపతి మాట్లాడుతూ, పార్టీకి, ప్రవాస తెలంగాణ సమాజానికి మధ్య వారధిగా అమెరికా శాఖ పని చేస్తుందన్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందిస్తామని పలువురు ఎన్నారైలు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎంపీ కవిత పలువురికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాగేందర్ మహీపతి, బిందు రెడ్డి, జలగం వెంగళ్, విజయ్ బొమ్మెన, మహేష్ తన్నీరు, రాజేష్ మాదిరెడ్డి, నరసింహ నాగులవంచ, చందు తాళ్ళ, నవీన్ కానుగంటి, అరవింద్ తక్కెళ్లపల్లి, శ్రీనివాస్ దొంతినేని, సక్రు నాయక్, నిరంజన్ అల్లంనేని, దివాకర్ రావు, గోపాల్ జనగామ, రాజ్ గౌలికర్ తదితరులు పార్టీలో చేరారు. అంతకు ముందు ఎంపీ కవితకు స్థానిక టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. హెలికాప్టర్ ద్వారా కవితపై గులాబీ పూల వర్షం కురిపించారు. రెండు వందలకు పైగా కార్లతో ర్యాలీ నిర్వహించారు. హిందూ టెంపుల్ ఆఫ్ మిన్నెసోటాలో ప్రత్యేక పూజలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *