mt_logo

ఎంపీ కవిత అధ్యక్షతన లండన్ లో NRI TRS UK కార్యవర్గ సమావేశం

ఎన్నారై టి.ఆర్.ఎస్ సెల్ యుకె కార్యవర్గ సమావేశం లండన్ లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి అధ్యక్షతన జరిగింది.

ఈ కార్యక్రమంలో ముందుగా, నూతన కార్యవర్గ సభ్యులని ఎంపీ కవిత గారికి పరిచయం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రవాస తెరాస కార్యకర్తల బాధ్యత, పార్టీ నిర్మాణానికి కృషి, తెలంగాణ రాష్ట్రం లో తెరాస ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లే వినూత్న విధానాలు, యుకె లో వివిధ వేదికల్లో తెలంగాణ ను మరియు తెలంగాణ నాయకత్వాన్ని ప్రదర్శించే అవకాశాలు మరియు భవిషత్తు కార్యక్రమాల పై దిశా నిర్దేశం తదితర అంశాల గురించి చర్చించడం జరిగింది.

ఎన్నారై టి.ఆర్.ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ముందుగా సంస్థ చేపడుతున్న కార్యక్రమాలని, భవిష్యత్తు ప్రణాళికను కవిత గారికి వివరించడం జరిగింది.

ఈ సందర్భంగా కవిత గారు మాట్లాడుతూ ఎన్నో త్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కూడా పటిష్ట నాయకత్వంతోనే సాధ్యమవుతుందని, తెలంగాణ పునర్నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర సమితి కట్టుబడి వుందని, కేసీఆర్ గారితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అన్నారు.

ప్రవాస తెరాస కార్యకర్తలుగా ప్రపంచ వేదికల్లో మన తెలంగాణ ఖ్యాతిని, నాయకుడు కేసీఆర్ గారి గొప్పతన్నాని తెలియజెప్పాలని, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటున్నందుకు, ఇక్కడి పద్దతులపై అధ్యయనం చేసి ఇటు ప్రభుత్వానికి సూచనలు -సలహాలు అందించేలా కృషి చెయ్యాలని తెలిపారు.

అలాగే పార్టీకి, పార్టీ నాయకత్వానికి ఎన్నారై టి.ఆర్.ఎస్ యుకె సభ్యుల పట్ల ప్రత్యేక గౌరవం ఉందని, ఉద్యమం నుండి నేటి వరకు పార్టీ వెంటే ఉండి, ఎంతో బాధ్యతగా సేవ చేస్తున్నారని, తప్పకుండ పార్టీ అన్ని సందర్భాల్లో మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ప్రవాస తెరాస శ్రేణులకు శిక్షణా తరగతులను నిర్వహించి ప్రభుత్వ పథకాల పై అవగాహనా కల్పించాలని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది.

చర్చల్లో కార్యవర్గ సభ్యుల సందేహాలకు సమాధానం ఇస్తూ, క్రమశిక్షణ గల కార్యకర్తలుగా ముందుకు వెళ్లాలని కవిత గారు అందరిలో స్ఫూర్తిని నింపారు. కవిత గారి ప్రోత్సాహం, దిశా నిర్దేశం నూతన ఉత్సాహాన్ని ఇచ్చాయని కార్యవర్గ సభ్యులు తెలిపారు.

అధికారిక పర్యటనలో భాగంగా లండన్ వచ్చినప్పటికీ, ప్రత్యేక సమయాన్ని కేటాయించి కార్యవర్గ సమావేశం లో పాల్గొని సభ్యులందిరిలో స్ఫూర్తినింపినందుకు కవిత గారికి ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అద్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి, శ్రీకాంత్ పెద్దిరాజు, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసర్ బోర్డు సభ్యులు సత్యం రెడ్డి కంది, ప్రవీణ్ కుమార్ వీర, సెక్రటరీ లు సృజన్ రెడ్డి, శ్రీధర్ రావు తక్కళ్లపల్లి, సంయుక్త కార్యదర్శి మల్లా రెడ్డి, మీడియా ఇన్‌చార్జ్ శ్రీకాంత్ జెల్ల, యూకే & ఈయూ ఇన్‌చార్జ్ విక్రమ్ రెడ్డి, IT సెక్రటరీ వినయ్ ఆకుల, కోశాధికారి మధుసూదన్ రెడ్డి, లండన్ ఇన్‌చార్జ్ సతీష్ రెడ్డి బండ, ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ రమేష్ యెసంపల్లి, నవీన్ మాదిరెడ్డి, ఈవెంట్స్ ఇన్‌చార్జ్ సత్యపాల్ పింగిళి, ఈవెంట్స్ కో ఆర్డినేటర్స్ నవీన్ భువనగిరి, రవి ప్రదీప్, సత్య చిలుముల, వెస్ట్ లండన్ ఇన్‌చార్జ్ గణేష్ పాస్తం, సురేష్ బుడగం, మరియు ముఖ్య సభ్యులు రవి కుమార్ రత్తినేని, హాజరైన వారిలో వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *